Dharani
Warangal Development: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ హైదరాబాద్‌తో పాటు.. ఇతర నగరాల అభివృద్దికి చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా తెలంగాణలో మరో నగరాన్ని హైదరాబాద్‌కు ధీటుగా అభివృద్ధి చేసేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..
Warangal Development: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ హైదరాబాద్‌తో పాటు.. ఇతర నగరాల అభివృద్దికి చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా తెలంగాణలో మరో నగరాన్ని హైదరాబాద్‌కు ధీటుగా అభివృద్ధి చేసేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు..
Dharani
హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ది చెందుతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు నగరంలో తమ కార్యకలపాలు కొనసాగిస్తున్నాయి. అంతేకాక అనేక ప్రభుత్వ రంగ సంస్థలు భాగ్య నగరంలో ఉన్నాయి. దేశం నలుమూలల నుంచి ప్రజలు భాగ్యనగరంలో ఉపాధి పొందడానికి తరలి వస్తుంటారు. నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే.. హైదరాబాద్ నగరం అభివృద్ధికి చర్యలు తీసుకుంటుంది. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. కూడా ఇదే బాటలో పయనిస్తుంది. అయితే కేవలం హైదరాబాద్ నగరాన్నే కాక.. రాష్ట్రంలోని ప్రధాన నగరాలను కూడా అభివృద్ధి చేయాలని భావిస్తోంది.
దీనిలో భాగంగానే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లతో పాటుగా రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం కేంద్రంగా మరో సిటీని అభివృద్ది చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలానే తెలంగాణలో మరో నగరాన్ని.. హైదరాబాద్‌కు ధీటుగా అభివృద్ధి చేసేందుకు రేవంత్ సర్కార్ అడుగులు వేయనుంది. విమానాశ్రయం, ఇన్నర్, ఔటర్ రింగు రోడ్లతో.. తెలంగాణలో మరో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు రెడీ అవుతోంది. ఇంతకు అది ఏ నగరం అంటే..
మధ్య తెలంగాణలో ప్రధాన నగరమైన వరంగల్ నగర అభివృద్ధిపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. భాగ్యనగరానికి ధీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. దీనిపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి కొండా సురేఖతో కలిసి.. మంగళవారం సెక్రటేరియట్‌లో సమీక్ష నిర్వమించారు. దీనిలో భాగంగా భద్రకాళి దేవస్థానం అభివృద్ధి, మెగా టెక్స్‌టైల్ పార్క్, స్మార్ట్ సిటీ పనులు, వరంగల్ ఎయిర్‌పోర్ట్, నర్సంపేటలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ గురుకుల స్కూల్ తదితర అంశాలపై మంత్రులు అధికారులతో చర్చించారు. వరంగల్ జిల్లా, నగర సమాగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొంటుందని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి ధీటుగా వరంగల్ అభివృద్ధి ఉండాలన్నారు. వరంగల్ ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, ఎయిర్‌పోర్ట్ కోసం చేపట్టే భూసేకరణలో రైతులకు న్యాయం జరిగేలా నష్టపరిహారం ఇవ్వాలని సూచించారు. స్మార్ట్ సిటీ పనులను ఈ ఏడాది డిసెంబరు 31లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తుది దశలో ఉన్న కాళోజీ కళాక్షేత్రం పనులను ఆగస్టు 20కి పూర్తి చేయాలని తెలిపారు. వచ్చే నెలలో అనగా సెప్టెంబర్‌లో సీఎం రేవంత్ ఈ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. భద్రకాళి ఆలయం అభివృద్ధికి ఆగమశాస్త్ర నియమాల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు.