iDreamPost

వీడియో: దంచి కొడుతున్న వానలకు నీటమునిగిన మేడారం

వీడియో: దంచి కొడుతున్న వానలకు నీటమునిగిన మేడారం

గత కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లో తట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇదిలా ఉంటే.. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికీ ఎన్నో ఇల్లు నీటమునిగి ప్రజలు వరద నీటిలో కొట్టుకుపోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ లోని కొన్ని ప్రాంతాలు మునిగిపోయాయి. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం జల దిగ్భంధంలో ఉండిపోయింది. ఆ గ్రామ సమీపంలో ఉన్న మోరంచ వాగు ఉప్పొంగడంతో ఊళ్లో ఇళ్లల్లో 4 నుంచి 5 అడుగుల వరకు వరద నీరు చేరింది. దీంతో ప్రజలను తమను తాము కాపాడుకోవడానికి ఇంటి స్లాబ్ లు ఎక్కుతున్నారు.

ఇక పరిస్థితి తీవ్రంగా ఉండడంతో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా స్పందించి అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో పాటు ఆర్మీ హెలీకాప్టర్లు ను సైతం అందుబాటులోకి తెచ్చి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ములుగు జిల్లా మేడారంలోని జంపన్న వాగుకు భారీ వరద నీరు చేరడంతో మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రాంగణం అంతా నీటితో నిండిపోయింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే కాకుండా ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా నీట మునగడంతో ఆదివాసి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే, మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రాంగణం వరద నీటితో మునిగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి: మోరంచపల్లి గ్రామానికి బయలు దేరిన ఆర్మీ హెలికాప్టర్లు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి