iDreamPost
iDreamPost
ఫిబ్రవరి రెండో వారంలో విడుదల ప్లాన్ చేసుకున్న ఆమిర్ ఖాన్ ప్రతిష్టాత్మక చిత్రం లాల్ సింగ్ చద్దా వాయిదా పడినట్టు బాలీవుడ్ టాక్. కొత్త డేట్ ఇంకా ప్రకటించలేదు కానీ ప్రస్తుతానికి బరిలో నుంచి తప్పుకున్నట్టు తెలిసింది. ఏప్రిల్ లో రిలీజ్ చేసేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. అదే నెలలో కెజిఎఫ్ 2 ఉన్నప్పటికీ ఒకే రోజు కాకుండా మరో అనుకూలమైన స్లాట్ ని లాక్ చేయబోతున్నారు. ఒకవేళ అప్పటికీ సాధ్యం కాకపోతే రంజాన్ పండగను టార్గెట్ చేయాలని చూస్తున్నారట. అదే జరిగితే సల్మాన్ ఖాన్ ప్లాన్ల మీద కొంచెం ఎఫెక్ట్ పడొచ్చు. ఎందుకంటే ఈద్ అంటే కండల వీరుడి మూవీ తప్ప ఇంకేదీ గుర్తుకు రాదు బాలీవుడ్ జనాలకు.
ఇప్పుడీ పోస్ట్ పోన్ వల్ల పూర్తిగా లాభపడేది అడవి శేష్ మేజర్. ఫిబ్రవరి 11 రిలీజ్ కాబోతున్న ఈ రియల్ లైఫ్ బయోపిక్ ని సోనీ సంస్థతో పాటు మహేష్ బాబు జంట నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ యాక్షన్ డ్రామాలో ముంబై తాజ్ మీద ఉగ్రవాద దాడులతో పాటు ఆ రోజు జరిగిన కీలకమైన సంఘటనలు హై లైట్ చేయబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న మేజర్ ని హిందీతో సహా అన్ని ప్రధాన భారతీయ భాషల్లోనూ తీసుకురాబోతున్నారు. వచ్చే నెల ట్రైలర్ రానుంది
మాస్ మహారాజా రవితేజ ఖిలాడీ కూడా అదే రోజు వస్తున్నప్పటికీ లాల్ సింగ్ చద్దా రాకపోవడం వల్ల దానికి కలిగే ప్రయోజనం పెద్దగా ఉండదు. ఎందుకంటే ఇది కేవలం తెలుగు వెర్షన్ తో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఫారెస్ట్ గంప్ రీమేక్ గా తీసిన లాల్ సింగ్ చద్దాకు నిర్మాణాంతర కార్యక్రమాలకు ఎక్కువ సమయం అవసరం పడుతుండటంతో ఇప్పుడీ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. కరీనా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో నాగ చైతన్య ఓ కీలక పాత్ర చేయడం విశేషం. బోర్డర్ లో యుద్ధం చేసే సైనికుడిగా కాస్త ఎక్కువ స్పేస్ ఉన్న క్యారెక్టరే చేశారట. సో చైతు ఫ్యాన్స్ ఇంకాస్త ఎక్కువ ఎదురు చూడక తప్పదు
Also Read : Mahesh Babu Trivikram Movie : త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయినా