iDreamPost
android-app
ios-app

ప్రభాస్ తో ప్రేమ – అంతా పబ్లిసిటీ స్టంటే

  • Published Nov 30, 2022 | 3:45 PM Updated Updated Nov 30, 2022 | 3:45 PM
  • Published Nov 30, 2022 | 3:45 PMUpdated Nov 30, 2022 | 3:45 PM
ప్రభాస్ తో ప్రేమ – అంతా పబ్లిసిటీ స్టంటే

నిజం నిద్రలేచే లోపు అబద్దం ప్రపంచం మొత్తం చుట్టి వస్తుందన్న తీరులో ఉంది సోషల్ మీడియా తీరు. ఆది పురుష్ హీరోయిన్ కృతి సనన్ ప్రభాస్ తో ప్రేమలో ఉందని ఆమె హృదయంలో అతను తప్ప ఇంకెవరు లేరని అర్థం వచ్చేలా వరుణ్ ధావన్ ఒక ప్రోగ్రాంలో అన్న మాటలు విపరీతంగా వైరల్ అయ్యాయి. అతను ప్రస్తుతం దీపికా పదుకునేతో కలిసి షూటింగ్ లో ఉన్నాడని చెప్పి మరీ క్లూ ఇవ్వడంతో అది ప్రాజెక్ట్ కె అని గుర్తు పట్టేసిన అభిమానులు వెంటనే దాన్ని ట్విట్టర్ లో ప్రచారం చేశారు. ఓ మీడియా వర్గం ఏకంగా పెళ్లి కొడుకు కాబోతున్న డార్లింగ్ అంటూ కథనాలు కూడా వండేశాయి. క్లైమాక్స్ ట్విస్టు ఏంటంటే ఇదంతా ఉత్తుత్తి వ్యవహారం.

దీనికి కృతి సననే స్వయంగా క్లారిటీ ఇచ్చింది. తాను ప్రేమలో కానీ పిఆర్ లో కానీ లేనని తేల్చి చెప్పింది. ఇదంతా తోడేలు ప్రమోషన్ కోసం తాను వరుణ్ లు కలిసి వేసిన ఎత్తుగడగా మీడియా పేర్కొంటోంది. ఇలాంటి చీప్ పబ్లిసిటీతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయడమేమిటని నెటిజెన్లు విరుచుకుపడుతున్నారు. ఇంతా చేసి తోడేలు నార్త్ లో పర్వాలేదనే వసూళ్లు తెచ్చుకోగా డబ్బింగ్ వెర్షన్లు మాత్రం డిజాస్టర్ అయ్యాయి. రిలీజ్ కు ముందు అంతగా హైప్ లేకపోవడంతో అందులో భాగంగా ఇలాంటి ట్రిక్స్ ప్లే చేసినట్టు కనిపిస్తోంది. అయినా బ్రహ్మచర్యం సినిమా తప్ప మరో ప్రపంచం లేకుండా గడిపేస్తున్న ప్రభాస్ నార్త్ భామ ప్రేమలో పడతాడా.

ఇంతా జరిగినా ప్రభాస్ స్పందించకపోవడమే మంచిది అయ్యింది. లేకపోతే ఇంకో కొత్త రంగు అద్దుకునేది. ఇక వీళ్ళిద్దరూ కలిసి నటించిన ఆది పురుష్ విడుదల ప్రస్తుతానికి జూన్ కే లాక్ అయ్యుంది. 2024కి పోస్ట్ పోన్ చేస్తారని, గ్రాఫిక్స్ మొత్తం రీ సెట్ చేయడానికి ఆరు నెలల సమయం సరిపోదని ఏవేవో ప్రచారాలు జరిగాయి కానీ అవన్నీ నిజం కాదని ప్రొడక్షన్ హౌస్ చెబుతోంది. ఏది ఏమైనా ప్యాన్ ఇండియా సినిమాల థియేటర్లలో అడుగు పెట్టేదాకా ఖచ్చితంగా ముందు అనౌన్స్ చేసిన డేట్ కి కట్టుబడతాయన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వాడిన ఆది పురుష్ లో సైఫ్ తదితర పాత్రధారుల లుక్స్ మీద మళ్ళీ వర్క్ జరుగుతోందని టాక్

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş