ప్రముఖ రచయిత ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ సాహితీ సప్తాహం హైదరాబాద్ త్యాగరాయగానసభలో శుక్రవారం నుంచి వారంపాటు జరుగనున్నదాని,ఏడురోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇనాక్ రచించిన ఒక్కో గ్రంథాన్ని ఆవిష్కరిస్తారని త్యాగరాయగానసభ అధ్యక్షుడు కళా వీఎస్ జనార్దన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
కొలకలూరి ఇనాక్ తెలుగు తెలుగు సాహితి రంగంలో పరిచయం అవసరం లేని పేరు. అతను తెలుగు పదాలకు వెలుగులద్దిన పదనిర్దేశి. ఆధునిక సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ ఆయనది అందెవేసిన చెయ్యి.తెలుగు సాహిత్య రంగానికి ఈయన చేసిన కృషికి గానూ..2014 లో భారత ప్రభుత్వం, జాతీయస్థాయిలో మహావ్యక్తులకు, మార్గదర్శకులకూ ఇచ్చే “‘పద్మశ్రీ”‘ పురస్కారం ప్రకటించి గౌరవించింది. 2015లో భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ వారు ఇచ్చే మూర్తిదేవి పురస్కారం ఇతని “అనంత జీవనం” అనే రచనకు లభించింది.2018లో ఇనాక్ గారు రచించిన ‘విమర్శిని’ పుస్తకానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిందని అందరికి తెలిసిన విషయమే… కాగా…
ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుందని పేర్కొన్నారు. శుక్రవారం నవంబర్ 8న మొదటిరోజు రంది నవల, 9న గుడి షార్ట్‌స్టోరీస్, 10న పోలీ అంథోపాలజీ షార్ట్‌స్టోరీస్, 11న మిత్ర సమాసం (రీసర్చ్), అంబేద్కర్ జీవితం (బయోగ్రఫీ), 12న మనూళ్లలో మా కథలు షార్ట్ స్టోరీస్, 13న విశాల శూన్యం పద్య సంపుటి, 14న చలన సూత్రం షార్ట్ స్టోరీస్ పుస్తకాల ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాలకు ప్రముఖులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.