iDreamPost
android-app
ios-app

Koffee With Karan 7 సమంత అంటే ‘డార్లింగ్’, అనన్య పాండే మాత్రం జువెనైల్, మ‌రి ర‌ష్మిక గురించి విజయ్ దేవరకొండ ఏమ‌న్నాడు?

  • Published Jul 29, 2022 | 1:31 PM Updated Updated Jul 29, 2022 | 1:31 PM
  • Published Jul 29, 2022 | 1:31 PMUpdated Jul 29, 2022 | 1:31 PM
Koffee With Karan 7 సమంత అంటే ‘డార్లింగ్’, అనన్య పాండే మాత్రం జువెనైల్, మ‌రి ర‌ష్మిక గురించి విజయ్ దేవరకొండ ఏమ‌న్నాడు?

విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఇటీవల కాఫీ విత్ కరణ్ 7కి గెస్ట్ లుగా వ‌చ్చారు. ఈ లైగ‌ర్ జంట హోస్ట్ కరణ్ జోహార్‌తో సరదాగా గ‌డిపారు. అంతేనా? డేటింగ్ నుండి స్టార్ కిడ్స్ వ‌ర‌కు చాలా విష‌యాల గురించి మాట్లాడారు. అంత‌కుముందు సారా ఆలీఖాన్, జాహ్న‌వి క‌పూర్ లిద్ద‌రూ విజయ్ గురించి హాట్ కామెంట్స్ చేశారు.

సమంత
మ‌రి స‌మంత గురించి విజ‌య్ ఎమంటాడు? క‌ర‌ణ్ ఇదే ప్ర‌శ్న అడిగాడు. సమంత ‘డార్లింగ్. అద్బుతమైన‌. అపురూపమైన మహిళగా అభివ‌ర్ణించాడు. ఆమె త‌న‌కు అత్యంత కావాల్సిన వ్యక్తి అని చెప్పాడు. ఎంత గొప్ప‌మాట‌లు!

అనన్య పాండే
లైగర్ కో-స్టార్ అన‌న్య గురించి చెప్ప‌డానికి విజయ్ దేవరకొండ ‘జువెనైల్’ అనే పదాన్ని వాడాడు. ఆమెను ఆరాధించే అమ్మాయిగా చెప్పాడు.

రష్మిక మందన్న
ర‌ష్మిక మంద‌న్నపై విజ‌య్ దేవ‌ర‌కొండ ఓపీనియ‌న్ కోసం ఇద్ద‌రి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సంగ‌తి తెలుసుకాబ‌ట్టే, రష్మికతో అనుబంధం గురించి విజ‌య్ ను క‌ర‌ణ్ జోహార్ అడిగాడు. ఇద్ద‌రూ జంటకాబోతున్నార‌న్న రూమ‌ర్ గ‌ట్టిగానే న‌డుస్తోంది. ర‌ష్మిక‌ను స్నేహితురాలు అని పిలిచాడు. మేమిద్దరం కలిసి 2 సినిమాలు చేశాం, ఆమె డార్లింగ్. నాకు ఆమె అంటే చాలా ఇష్టం. ఆమె నాకు చాలా మంచి స్నేహితురాలు. సినిమాల్లోనే ఎదుగుద‌ల, ప‌త‌నాల‌ను చూస్తాం. అలా బంధం ఏర్పడుతుంది. సినిమాల్లో, మీరు చాలా త్వరగా సన్నిహిత‌మ‌వుతారు. తద్వారా బంధం తొంద‌ర‌గా బ‌ల‌ప‌డుతుంద‌ని విజ‌య్ చెప్పాడు.

జాన్వీ కపూర్
విజయ్ దేవరకొండపై జాన్వీ కపూర్‌కు విపరీతమైన క్ర‌ష్ ఉంద‌ని కొద్దికాలంగా ప్ర‌చారం న‌డుస్తోంది. మ‌రి జ‌న్వీ క‌పూర్ గురించి అడిగినప్పుడు, అతను ఆమెను ‘క్యూట్’ అని పిలిచాడు. ఆమెను రెండుసార్లు కలిశానని కూడా చెప్పాడు. అంత‌కుమించి మ‌న‌సు విప్ప‌లేదు. ఇద్ద‌రి జంట స్క్రీన్ మీద బాగుంటుంద‌న్నది చాలామంది మాట‌. కొంద‌రు టాలీవుడ్ నిర్మాత‌లుకూడా ఈ జంట‌తో సినిమా తీయాల‌నుకొంటున్నారు.

సారా అలీ ఖాన్
కాఫీ విత్ కరణ్ 7లో ఎపిసోడ్ లోనే విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలనుకుంటున్నట్లు సారా అలీ ఖాన్ చెప్పింది. మ‌రి ఆమె మీద నీ ఒపీనియ‌న్ అన్న‌ప్పుడు, ఆమెకు చమత్కారం ఎక్కువ‌, ఫన్నీ అని అన్నాడు. అలాగైతే స‌రే. అంత‌క‌న్నా ముందుకెళ్లే బాలీవుడ్ వ‌ర్గాల నుంచి గాసిప్స్ పుడ‌తాయిక‌దా!

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique