iDreamPost
android-app
ios-app

Koffee With Karan 7: రణవీర్ లాగే నగ్నంగా పోజులివ్వడానికి విజయ్ దేవరకొండ రెడీ, ఒక్క‌టే కండీష‌న్

  • Published Jul 29, 2022 | 12:53 PM Updated Updated Jul 29, 2022 | 12:53 PM
  • Published Jul 29, 2022 | 12:53 PMUpdated Jul 29, 2022 | 12:53 PM
Koffee With Karan 7: రణవీర్ లాగే నగ్నంగా పోజులివ్వడానికి విజయ్ దేవరకొండ  రెడీ, ఒక్క‌టే కండీష‌న్

కరణ్ జోహార్ చాట్ షో కాఫీ విత్ కరణ్ 7 రోజురోజుకు స‌న్సేష‌న‌ల్ గా మారుతోంది. కొత్త టీజ‌ర్ వ‌చ్చిందంటే…కొత్త టాపిక్ మోత‌మోగిపోతోంది. క‌ర‌ణ్ జోహార్ 4వ ఎపిసోడ్‌లో, సౌత్ సూపర్ స్టార్ విజయ్ దేవరకొండతో పాటు, లిగర్ హీరోయిన్ అనన్య పాండే ఉన్నారు. విజ‌య్ యాటిట్యూడ్ తెలుసుక‌దా! కాస్త బిడియం ఉన్నా, మొహ‌మాటం ఉండ‌దు. క్వ‌శ్చ‌న్ బ‌ట్టి క్రేజీ ఆన్స‌ర్లుంటాయి. అందుకే క‌ర‌ణ్ జోహార్ షోలో బాలీవుడ్ హీరోల‌కు తీసిపోని స్టైల్ లో, వెట‌కారం ద‌ట్టించిన ఆన్స‌ర్లిచ్చాడు. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ గెలిచాడు. ఆటైంలోనే అదునుచూసి న్యూడ్ ఫోటోషూట్ చేస్తావా అని క‌ర‌ణ్ అడిగాడు.

ఇంట‌ర్నేష‌నల్ మ్యాగజైన్ కోసమైతే న్యూడ్ ఫోటోషూట్ కి రెడీ అని రౌడీ బాయ్ తేల్చేశాడు. ఒక కండీష‌న్ పెట్టాడు. షూట్ మాత్రం రిచ్ ఉండాల‌న్నాడు. “బాగా షూట్ చేస్తే నాకు అభ్యంతరం లేదు” అని విజ‌య్ చెప్పాడు. ఈ స‌మాధానంప‌ట్ల అనన్య పాండే చాలా ఎగ్జైట్ అయిన‌ట్లే క‌నిపిస్తోంది. విజయ్ ని న్యూడ్ గా చూడాల‌నుకొంటున్న‌ట్లు చెప్పింది. అప్పుడే క‌ర‌ణ్ మ‌రో స్లీజీ క్వ‌శ్చ‌న్ వేశాడు. కండోమ్ బ్రాండ్ యాడ్ కోసం న‌టిస్తారా అని అడిగాడు. “మీరు పది మంది పిల్లలను కన‌గూడ‌ద‌నుకొంటే నిజంగా తెలివైన, సురక్షితమైన పని అని నేను అనుకొంటున్నా. దీనికి నేను ఒకే అని విజయ్ చెప్పాడు. నిజానికి లైగర్ పోస్టర్ కోసం మొత్తం బాడీని మొత్తాన్ని చూపించాడు. ఒక్క‌ పూల గుత్తి మాత్రం క‌ప్పాడు.

న్యూడ్ ఫోటోషూట్ కోసం విజయ్ దేవరకొండ రెడీయే. కాని రణవీర్ సింగ్ ఇటీవల పేపర్ మ్యాగజైన్‌తో ఫోటోషూట్ కోసం న్యూడ్ గా పోటోలు దిగ‌డంతో, సోష‌ల్ మీడియా ట్రోల‌ర్స్ గుప్పిట చిక్కాడు. అత‌న్ని తెగ ఆడుకొంటున్నారు. మ‌హిళాసంఘాలు గుర్రుమంటున్నాయి. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇది మహిళల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పేర్కొంటూ ఓ ఎన్జీవో కేసు పెట్టింది. ముంబైలో ఓ లాయర్ స్టార్ పై కేసు పెట్టాడు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 292 (అశ్లీల విషయాలను ప్రచురించడం), 293 (యువకుడికి అసభ్యకరమైన వస్తువులను విక్రయించడం) 509 (మహిళ‌ల అసభ్యతను కించపరిచేలా ఉద్దేశించిన పదం, సంజ్ఞ లేదా చర్య) మరియు సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు. (A) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 (లైంగికంగా అసభ్యకరమైన విషయాలను ప్రచురించడం)లో కేసు పెట్టారు. మ‌రి, విజ‌య్ కూడా ర‌ణవీర్ సింగ్ లా దేశంమొత్తం నివ్వెర‌పోయేలా మ‌రొక‌టి చేయ‌డానికి సిద్ధ‌మేనా?

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss