iDreamPost
android-app
ios-app

ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి

ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి

ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కారణంగా అనేక ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారంలోకి వచ్చి మంత్రులుగా ఎన్నికైన కొత్తలోనే రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేస్తామని ప్రకటించిన జగన్ అదే బాటలో నడిచారు. కొద్దిరోజుల క్రితం మంత్రివర్గం అంతా రాజీనామాలు చేయగా ఇప్పుడు కొత్త మంత్రివర్గం కొలువు తీరనుంది. పాత, కొత్త కలయికతో క్యాబినెట్ కూర్పు చేసిన సీఎం జగన్ మంత్రివర్గంలో చోటు దక్కని నేతలకు కీలకమైన పదవులు కల్పిస్తున్నారు.

ఈ క్రమంలో మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా అవకాశం కల్పించారు. కేబినెట్‌ హోదాలో ఆయనకు రాష్ట్ర అభివృద్ధి బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించనున్నారు. అలాగే చీఫ్ విప్‌గా నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి డిప్యూటీ స్పీకర్‌గా, ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణులకు చోటు కల్పించారు వైఎస్ జగన్.

ఇక మరో పక్క మొత్తం 25 మందితో కూడిన సభ్యుల జాబితాను ప్రకటించారు. 10 మంది పాత మంత్రులు, 15 మంది కొత్త వారితో కొత్త క్యాబినెట్ కూర్పు చేశారు. సచివాలయంలో రేపు ఉదయం 11.31 నిముషాలకు నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. మాజీలుగా మారిన మిగతావారికి పార్టీ బాధ్యతలు ఇచ్చి 2024 ఎన్నికలకు సిద్ధం అవ్వాలని జగన్ భావిస్తున్నారు.