iDreamPost
android-app
ios-app

Jabardasth Kiraak RP Engagement Photos: జబర్ధస్ కిరాక్‌ ఆర్పీ నిశ్చితార్థం, ఫొటోలు

  • Published May 26, 2022 | 11:45 AM Updated Updated May 26, 2022 | 11:45 AM
Jabardasth Kiraak RP Engagement Photos: జబర్ధస్  కిరాక్‌ ఆర్పీ నిశ్చితార్థం, ఫొటోలు

కామెడీ టైమింగ్ తో న‌వ్వించే కిరాక్‌ ఆర్పీ స‌రైన స‌మ‌యంలో ప్రేయసి లక్ష్మీ ప్రసన్నతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. జ‌బ‌ర్ద‌స్త్ మిత్రులు, క్లోజ్ ఫ్రెండ్స్ ను ఆహ్వానించాడు.

ఈ నిశ్చితార్థానికి నటుడు ధనరాజ్‌ కుటుంబ సమేతంగా హాజరైయ్యాడు. వారితో దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసి, శుభాకాంక్షలు చెప్పాడు. ఆర్పీ ఎంగేజ్‌మెంట్‌కు కమెడియన్లు, జ‌బ‌ర్ద‌స్త్, బుల్లితెర సెలబ్రిటీలు వచ్చారు.

ఆర్‌పీ ఇటీవలే యూట్యూబ్‌ చానల్‌ మొదలు పెట్టాడు. అందులో మొద‌టి వీడియో, త‌న‌ హోమ్‌ టూర్‌. అప్పుడే, లిఫ్ట్‌, హోం థియేటర్‌, అన్నింటినీ చూపించిన ఆర్పీ, తన బెడ్‌రూమ్‌లోని ఓ అమ్మాయి ఫొటో చూపించి ఆమె తనకు కాబోయే భార్య అని జనాలకు పరిచయం చేశాడు.