ఈ మేక ధర రూ.12 లక్షలు! ప్రత్యేకత ఏంటంటే..

ఈ మేక ధర రూ.12 లక్షలు! ప్రత్యేకత ఏంటంటే..

మేకలు, పొట్టేలను మాంసం కోసం ఇతర అవసరాల కోసం ఉపయోగిస్తుంటారు. పాడిపరిశ్రమలో వీటి పోషణ కూడా ఒకటి. ఎంతో మంది రైతులు మేకలు, పొట్టేలను పెంచుకుంటూ జీవనం సాగిస్తుటారు. వీటి ధర వేలల్లో మాత్రమే ఉంటుంది. కానీ ఓ మేక ధర వింటే షాక్ అవ్వాల్సిందే. ఆ మేక ధర అక్షరాలా రూ.12 లక్షలు.  ఈ ధర విని మీరు షాకయ్యారా? అది ఓ మేక ధరా..? లేక మేకల మంద ధరా..? అనే సందేహం రావచ్చు. కానీ ఈ ధర మాత్రం ఒక్క మేకకే. మరి.. ఈ మేక పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

లక్షల ధర పలికిన ఈ మేక కోటా జాతికి చెందినది. దాని పేరు ‘కింగ్’..అందుకు తగినట్లుగా భారీగా బాహుబలి సినిమాలో దున్నపోతు ఉన్నట్లు ఉంటుంది. బలమైన ఆహార పెట్టి దాని యజమాని బాగా మేపటంతో పది, ఇరవై, ముప్పై కాదు.. ఏకంగా 176 కిలోలు పెరిగింది. మధ్యప్రదేశ్‌లో ఇందౌర్‌లో ఈ మేక ఏకంగా రూ.12 లక్షలకు అమ్ముడుపోయింది. ఇందౌర్ ప్రాంతానికి చెందిన సుహైల్  అహ్మద్ అనే వ్యక్తి ఎనిమిది నెలల క్రితం రాజస్థాన్ నుంచి ఈ మేకను కొనుగోలు చేశాడు. ఆ  సమయంలో దానికి కింగ్ అని పేరు పెట్టుకుని పెంచుకున్నాడు. పేరుకు తగినట్లే  బలమైన ఆహారం పెట్టటమే కాకుండా దానికి ప్రత్యేకించి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశాడు.

రోజూ కింగ్ కి శనగలు, గోధుమలు, పాలు ఖర్జూరం వంటివి ఆహారంగా అందించేవారు. వేసవిలో వేడి గాలుల నుంచి కింగ్ ఇబ్బంది పడకుండా కూలర్ కూడా ఏర్పాటు చేశాడు. అయితే ఎంతో బలమైన ఆహారం పెట్టి పెంచినా.. మేకలను, పొట్టేలను మాంసం కోసమే ఉపయోగిస్తారనే విషయం మనందరికి తెలిసిందే. అలానే బక్రీద్‌ సందర్భంగా దానిని సుహైల్ అమ్మకానికి పెట్టాడు. ముంబయికి చెందిన ఓ వ్యక్తి ఈ మేకను రూ.12 లక్షలకు కొనుగోలు చేశాడు.  దీంతో దాని యజమానికి ధర బాగా గిట్టటంతో తెగ సంతోష పడిపోతున్నాడు. తాను కింగ్ పై పెట్టిన పెట్టుబడికి లాభం బాగా వచ్చిందని దాని సూహైల్ ఆనందం వ్యక్తం చేశాడు. మరి.. ఈ మేక ధరపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments