iDreamPost
android-app
ios-app

షాపులో బొమ్మని పగులగొట్టిన బుడ్డోడు.. 3.32 లక్షలు చెల్లించాల్సొచ్చిన తండ్రి..

  • Published May 26, 2022 | 9:45 AM Updated Updated May 26, 2022 | 9:45 AM
షాపులో బొమ్మని పగులగొట్టిన బుడ్డోడు.. 3.32 లక్షలు చెల్లించాల్సొచ్చిన తండ్రి..

మనం పిల్లలతో కలిసి బొమ్మల షాపుకి వెళ్ళినప్పుడు చిన్న పిల్లలు అనుకోకుండా బొమ్మల్ని పగలగొడుతూ ఉండే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ సంఘటనలో ఒక బొమ్మల షాపులో అనుకోకుండా చిన్న పిల్లోడు ఓ బొమ్మని పగలగొట్టడంతో అతని తండ్రి 3.32 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హాంకాంగ్‌ మోంగ్ కోక్‌లోని ఓ డిజైనర్ బొమ్మల దుకాణానికి చెంగ్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి వెళ్ళాడు.

ఆ షాపులో 1.8 మీటర్ల పొడవైన టెలీటబ్బీస్ బొమ్మ ఉంది. పిల్లలు బొమ్మలు చూస్తుండగా తండ్రి చెంగ్ ఒక ఫోన్ కాల్‌ మాట్లాడటానికి స్టోర్ నుండి బయటికి వెళ్ళాడు. ఇంతలో షాప్ లోంచి పెద్ద శబ్దం వినపడటంతో లోపలికి వెళ్లి చూసాడు చెంగ్. అక్కడికి లోపలి వెళ్లేసరికి ఆ టెలీటబ్బీస్ బొమ్మ కింద పడి పగిలిపోయి ఉంది. పక్కనే తన కొడుకు నిల్చొని ఉన్నాడు. దీంతో ఆ షాపు వాళ్ళు ఆ పిల్లోడు బొమ్మని పగలగొట్టాడు, దాని ధర HK$52,800 (రూ. 5.22 లక్షలు) చెల్లించాలని ఆ తండ్రిని అడిగారు.

అయితే మొదట తండ్రి తన కొడుకు ఏమి చేయలేదని, ఆ బొమ్మని పగలగొట్టలేదని, అక్కడ నిల్చొని చూస్తున్నాడని చెప్పి డబ్బు కట్టను అన్నాడు. దీంతో షాపు వాళ్ళు అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ చూపించగా చెంగ్ కొడుకు పరిగెడుతూ ఆ బొమ్మని తోసేసినట్టు ఉంది. దీంతో చెంగ్ తన కొడుకు వల్లే అది పగిలింది అని ఒప్పుకున్నాడు. అయితే దాని ధర చాలా ఎక్కువగా ఉంది అనడంతో షాపు వాళ్ళు చిన్న పిల్లోడు అనుకోకుండా చేసాడు అని దయతలిచి ఆ బొమ్మ మీద వచ్చే ప్రాఫిట్, ట్యాక్స్ లు అన్ని తీసేసి వాళ్ళు కొన్న రేటు HK$33,600 (రూ. 3.32 లక్షలు) చెల్లించాలని అడిగారు. దీంతో ఆ తండ్రి ఆ పగిలిన బొమ్మ కోసం అన్ని డబ్బులు చెల్లించక తప్పలేదు.

దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో, అక్కడి వార్తల్లో వైరల్ గా మారింది. పాపం బుడ్డోడు అనుకోకుండా బొమ్మని తోస్తే అది పగిలి తండ్రి రూ. 3.32 లక్షలు కట్టాల్సి రావడంతో ఆ తండ్రిపై సింపతీ చూపిస్తూ ఎంత పని చేసావురా బుడ్డోడా అని అంటున్నారు నెటిజన్లు.