iDreamPost
android-app
ios-app

వీడియో: బాలుడిపై మరో బాలుడి హింస్మాతక దాడి!

వీడియో: బాలుడిపై మరో బాలుడి హింస్మాతక దాడి!

ప్రస్తుతం సమాజంలో పాఠశాల దశలోనే కొందరు పిల్లలు నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిల వ్యవహారం, దొంగతనాలు ఇతర విషయాల్లో బాలురు నేరాలకు పాల్పడుతున్నారు. అంతేకాక చదువు కోవాల్సిన వయస్సులో ఆయుధాలు పట్టుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే అనేకం జరగ్గా తాజాగా బెంగళూరులో జరిగిన ఓ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.  ఓ చిన్న బాలుడిపై మరో బాలుడు పిడిగుద్దులతో దాడి చేశాడు. ఈ ఘటన  బెంగళూరు నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కర్ణాటక రాష్ట్రం బెంగళూరు చిక్కలసంద్ర ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్‌ పాఠశాల గదిలో ఓ ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు. ఆయన ఒక బాలుడిని మూత్ర విసర్జనకు తీసుకెళ్లాగా వీరందరు  ఉన్నారు. ఈ క్రమంలో నాలుగేళ్లు బాలుడు అంతకంటే చిన్న బాలుడిపై దాడికి పాల్పడ్డాడు. ఆ బాలుడిని చితకబాదిన తీరు అందరికి గుండెలు తరుక్కుపోయేలా చేసింది. చివరకు ఈ ఘటన గురించి బాధితుడి తల్లిదండ్రులకు, పాఠశాల యాజమాన్యంకి తెలియడంతో సీసీ టీవీ పుటేజీ పరిశీలించారు. అది  చూసిన తరువాత ఏ పిల్లల తల్లిదండ్రులకైనా ప్రాణాలు పోయినంత పనిగా ఉంటుంది. ఆ వీడియోలో ఓ చిన్నారిని.. మరో బాలుడు పదేపదే భౌతికంగా పిడిగుద్దులు గుద్దాడు.

అలా కాసేపు విరామం ఇస్తూ  పలుమార్లు ఆ బాలుడిపై దాడిచేసి ఘోరంగా తన్నాడు. దాడిచేసిన బాలుడి వ్యవహారం చూస్తే.. ఏదో పగ పెంచుకున్న వ్యక్తిలా చిన్నారిని కిందవేసి తొక్కాడు. బుధవారం నాటి ఈ సంఘటన దృశ్యాలు పాఠశాలల సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఆయ తలుపు మూసివేసిన తరువాత ఎనిమిది మందిలోని ఓబాలుడు ఈ దాడికి పాల్పడ్డాడు.  బాధిత బాలుడి తల్లి అక్కడికి వచ్చి.. ముక్కు నుంచి రక్తం కారుతుండటం గమనించారు. సీసీ కెమెరా దృశ్యాలను చూసిన ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడి తల్లిదండ్రులు సుబ్రమణ్యపుర పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గురించి పోలీసులు కూడా స్పందించారు.

”ఆ బాలుడి చర్య ఎంతమాత్రం సహించదగినది కాదు. అలాగని అతడిని విచారించేంత వయసు కూడా కాదు. బహుశా బాలుడి కుటుంబం, అతడి ఇంటి పరిసరాల వద్ద అలాంటి వాతావరణం ఉందేమో’’ అని ఎస్సై మంజునాథ తెలిపారు. చిన్నారి దాడి ఘటనపై విచారణ జరపాలని కర్ణాటక పోలీసులు ఆ రాష్ట్ర విద్యాశాఖకు సూచించారు. ఈ మేరకు విద్యాశాఖను నివేదిక ఇవ్వమని కోరారు. ఈ ఘటన వైరల్ కావడంతో  పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే దీనికి కారణమని అన్నారు. చిన్నారులను అలా గదిలో వదిలి వెళ్లడం మంచిది కాదని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.