iDreamPost
android-app
ios-app

మెగా రీమేక్ కోసం ఈగ విలన్ ?

  • Published Oct 30, 2020 | 11:08 AM Updated Updated Oct 30, 2020 | 11:08 AM
మెగా రీమేక్ కోసం ఈగ విలన్  ?

మొన్న పండగ రోజు గుట్టుచప్పుడు కాకుండా ప్రకటించిన పవన్ కళ్యాణ్ నటించబోయే అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్ తాలూకు తెరవెనుక పనులు వేగంగా జరుగుతున్నాయి. తక్కువ లొకేషన్లలో వేగంగా పూర్తి చేసే విధంగా స్క్రిప్ట్ ఉండటంతో ఎక్కువ ఆలస్యం చేయకుండా వకీల్ సాబ్ కాగానే పవన్ దీని మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. తను పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుండగా మధ్య వయసులో వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకునే ధనవంతుడైన మరో హీరో పాత్ర కూడా ఉంది. అది ఎవరు చేస్తారనే లీక్ మాత్రం ఖచ్చితంగా బయటికి రావడం లేదు. ఇప్పటికే రానా, రవితేజ, నితిన్ అంటూ ఏవేవో పేర్లు వినిపించాయి.

ఇవేవి వర్కౌట్ కానీ పక్షంలో ఈగ విలన్ కన్నడ స్టార్ హీరో సుదీప్ అయితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో టీమ్ ఉన్నట్టు వినికిడి. సుదీప్ శాండల్ వుడ్ లోనే చాలా బిజీగా ఉన్నాడు. ఈగ, బాహుబలి తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా వద్దనుకుని చిరంజీవి మీద అభిమానంతో ఒక్క సైరాలో మాత్రమే స్పెషల్ రోల్ కు ఒప్పుకున్నాడు. తనకు పవన్ అంటే కూడా ఇష్టమే. ఇటీవలే తనను పర్సనల్ గా ఇంట్లో కలిసి కాసేపు చర్చలు కూడా జరిపాడు. ఇది అయ్యప్పనుం గురించేనని ఫిలిం నగర్ న్యూస్. పవన్ స్వయంగా రిక్వెస్ట్ చేయడంతోనే సుదీప్ వచ్చి కలిశాడని కూడా అంటున్నారు. ఇందులో నిజమెంతుందో తెలియాల్సి ఉంది

ఇదే కనక కుదిరితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. రానా మిస్ చేసుకుంటే సుదీప్ కన్నా బెటర్ ఆప్షన్ మరొకరు ఉండరు. పైగా తను చేస్తే మరో ప్లస్ పాయింట్ ఉంది. కన్నడలో మార్కెటింగ్ ఈజీగా అవుతుంది. పవన్ సుదీప్ ల కాంబో అంటే కర్ణాటకలోని ఇద్దరు హీరోల అభిమానులు చేసే రచ్చ మాములుగా ఉండదు. ఇది బిజినెస్ కోణంలో చూస్తే చాలా లాభదాయకం. పైగా అక్కడి భాషలో డబ్బింగ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది కాబట్టి రీచ్ పెరుగుతుంది. అయితే ఇదంతా కొలిక్కి రావడానికి ఇంకో నెలరోజుల పైనే పట్టొచ్చు. ఇంకా వకీల్ సాబ్ సెట్లోనే పవన్ అడుగు పెట్టలేదు. అదయ్యాక ఈ బిల్లారంగా(ప్రచారంలో ఉన్న టైటిల్)తాలూకు క్లారిటీ రావొచ్చు