iDreamPost
android-app
ios-app

కేజీఎఫ్ 2లా విక్రాంత్ రోణా కూడా 1000 కోట్లు వ‌సూలు చేస్తుందా? వెయ్యికాదు, రూ.2000కోట్లు

  • Published Jun 23, 2022 | 8:05 PM Updated Updated Jun 23, 2022 | 8:05 PM
కేజీఎఫ్ 2లా విక్రాంత్ రోణా కూడా 1000 కోట్లు వ‌సూలు చేస్తుందా? వెయ్యికాదు, రూ.2000కోట్లు

రాబోతున్న విక్రాంత్ రోనా మూవీ ఎన్నికోట్లు వ‌సూలు చేస్తుంది? కేజీఎఫ్2లా వెయ్యికోట్ల క్ల‌బ్ లో చేరుతుందా? అని క‌న్న‌డ ఫిల్మ్ స్టార్ కిచ్చా సుదీప్ ను, రిపోర్ట‌ర్ అడిగితే, వెయ్యికాదు, రెండువేల కోట్లు క‌లెక్ట్ చేస్తుందంటూ రిప్ల‌య్ ఇచ్చాడు. కేజీఎఫ్ 2 మొత్తం మీద రూ.1200 కోట్లును వసూలు చేసింది. మ‌రి విక్రాంత్ రోనా సంగతేంటి? కిచ్చా సుదీప్ న‌వ్వుతూ స‌మాధాన‌మిచ్చాడు. వెయ్యికోట్లు ఒక‌రిని సంతోష‌పెడితే, నేను రెండువేల కోట్లు కావాల‌నుకొంటాన‌ని రిప్ల‌య్ ఇచ్చాడు.

అనూప్ బండారీ(Anup Bhandari) డైరెక్ట్ చేసిన విక్రాంత్ రోణా(Vikrant Rona) క‌న్న‌డ‌, తెలుగు, మ‌ల‌యాళం, హిందీ, ఇంగ్లీషుల్లోనూ రిలీజ్ అవుతోంది. ఈగ , బాహుబ‌లి, ద‌బాంగ్ 3 తో దేశం మొత్తానికి తెలిసిన సుదీప్
సౌత్ సినిమాల‌కు అందిరినీ ఆక‌ట్టుకొనే ఎమోష‌న్స్ ఉంటాయికాబ‌ట్టి, సూప‌ర్ హిట్ అవుతాయ‌ని అన్నాడు.

మారిన ఆడియ‌న్స్ టేస్ట్ గురించి కిచ్చా మాట్లాడాడు. అంద‌రూ ఓటీటీలోనే చూస్తున్నారు. కోవిడ్ రాక‌పోతే కొరియా సినిమాల‌ను అంత‌లా చూసేవాళ్ల‌మా? అని అన్నాడు. ఇప్పుటిదాకా మ‌న సినిమాల‌నే మ‌నం చూస్తున్నాం. ఒక్క‌సారిగా ప్ర‌పంచ సినిమాను చూస్తుంటే, ఇంత మంచి సినిమాలు త‌యారుచేస్తున్నారా అని తెలిసింది. అందువ‌ల్ల ఒక సినిమాతో మ‌రోసినిమాకు పోలీకే అక్క‌ర్లేదు. అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ తో, తెలుగు సినిమా పాన్ ఇండియా మూవీస్ చేస్తోంది. ఆ సినిమాల‌తో నేను పోల్చుకోను. క‌న్న‌డ సినిమా గొప్ప‌గా ఎదుగుతోంది. అందుకు గ‌ర్వంగా ఉంది. టీవీల్లో , డబ్బింగ్ సినిమాలు చూసేవాళ్లం. ఇప్పుడు క‌న్న‌డ సినిమా కోసం థియేట‌ర్ల‌కు వ‌స్తున్నార‌ని సుధీప్ గ‌ర్వంగా చెప్పాడు.

కిచ్చా సుదీప్ తోపాటు ‘విక్రాంత్‌ రోణ’లో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, నిరూప్‌ భండారి, నీతా అశోక్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. జాక్‌ మంజునాథ్, షాలినీ మంజునాథ్ ఈ సినిమాకు నిర్మాత‌లు. ‘ఆ ఊరే ఒక మర్మమైన ఊరు. ఆ ఊరి ప్రజలు ఏదో ఒక భయంకరమైన కథని దాచాలనుకుంటున్నారు. కథని దాచగలరు, కానీ భయాన్ని దాచలేరుగా. ఆ స్టోరీ మళ్లీ మొదలైంది. ఆ డెవిల్‌ మళ్లీ వచ్చాడంటూ ట్రైలర్‌ ప్రారంభమవుతుంది.

భయం నిండిన ఆ ఊరిలో, భయమంటే ఏంటో తెలియ‌ని ఒకడు వచ్చాడంటూ విక్రాంత్‌ రోణగా సుదీప్‌ పాత్రను పరిచయం చేశారు. ట్రైలర్ లో క్వాలిటీ ఉంది. ఈ సినిమాకు ఓటీటీ నుంచి వంద కోట్ల ఆఫ‌ర్ వ‌చ్చింది. కాని సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వడానికి దీన్ని థియేటర్‌లోనే రిలీజ్‌ చేస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ చెప్పాడు. ‘రా రా రాక్కమ్మా’ సాంగ్ బాగా వైర‌ల్ అయ్యింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట‌ను మంగ్లీ, నకాష్‌ అజీజ్‌ పాడారు. ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో జూలై 28న విడుదలవుతోంది.