భారత్‌పై భారీ కుట్ర.. ఖలిస్థానీ టెర్రరిస్ట్ ఆడియో మెసేజ్

భారత్‌పై భారీ కుట్ర.. ఖలిస్థానీ టెర్రరిస్ట్ ఆడియో మెసేజ్

ప్రస్తుతం భారత్, కెనడా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుదేశాలు పరస్పరం పలు ఆంక్షలు విధించుకున్నాయి. కొందరు ఖలిస్థానీ పేరిట భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వారిలో చాలా మంది కెనడాలో ఉంటున్నారు. ఈ ఏర్పాటు వాదుల్లో కొందరు ఇటీవల హత్యకు గురయ్యారు. అనంతరం కెనడా, భారత్ మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ నేఫథ్యంలోనే భారత్ పై భారీ కుట్ర ఒకటి బయటపడింది. ఖలిస్థానీ టెర్రరిస్ట్ పేరుతో ఓ ఆడియో మేసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత దేశాన్ని ముక్కులు చేసి, చాలా దేశాలుగా విభజించాలనుకున్న వీరి కుట్ర వెలుగులోకి వచ్చింది.

నిషేధిత సిక్కు వేర్పాటు వాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూవ్ గురించి సంచలన విషయం ఒకటి బయటకు వచ్చింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) తమ దర్యాప్తులో అనేక విషయాలను కనిపెట్టింది. భారత్ ను ముక్కలుగా విభజించి.. చాలా దేశాలుగా ఏర్పాటు చేయాలని పన్నూవ్ కుట్ర పన్నినట్టు ఎన్ఐఏ తన నివేదికలో తెలిపింది. భారత దేశ సమగ్రతను, ఐఖ్యతను అతడు సవాల్ చేసినట్లు.. ఆడియో మెసేజ్ లలో అధికారులు గుర్తించారు. కాశ్మీర్ ప్రజల కోసం ఒక ప్రత్యేక ముస్లిం దేశాన్ని సృష్టించాలని, దానికి డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఉర్దుస్తాన్ అనే  పేరు పెట్టాలని పన్నూన్  కుట్ర చేసినట్లు వెల్లడైంది.

ఖలిస్తానీ టెర్రరిస్ట్ అర్షదీప్ దల్లాకు  పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబాతో లింక్స్ ఉన్నాయని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఖలిస్థానీ అనేది కెనడాకు చెందిన టెర్రరిస్ట్ సంస్థ అనే విషయం మనకు తెలిసిందే.  పంజాబ్ లోని హిందూ నేతలను టార్గెట్ చేయడమే అర్షదీప్  లక్ష్యంగా పెట్టుకున్నాడని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. భారత్, కెనడా మధ్య దౌత్య వివాదం నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి రవాడం ప్రాధాన్యం సంతరించుకుంది.  ఈ ఏడాది ప్రారంభంలో ఎన్ఐఏ అధికారులు, ఢిల్లీ పోలీసులు జహంగీర్ పురిలో దాడులు చేసి.. ఆయుధాలతో ఉన్న జగ్గీత్ సింగ్ జగ్గా, నౌషద్ లను పట్టుకునన్నారు.  వారిని అరెస్ట్ చేసి విచారించగా అనేక సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే లష్కరే తాయిబా ఉగ్రవాది సుహైల్ తో అర్షదీప్ దల్లాకు సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.

Show comments