iDreamPost
android-app
ios-app

కెజిఎఫ్ 2 : సంథింగ్ ఫిషీ

  • Published Apr 19, 2020 | 12:06 PM Updated Updated Apr 19, 2020 | 12:06 PM
కెజిఎఫ్ 2 : సంథింగ్ ఫిషీ

ఈ ఏడాది అక్టోబర్ 23న కెజిఎఫ్ 2 గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని ప్రకటించిన కొద్దిరోజులకే లాక్ డౌన్ వచ్చి పడింది. ఇప్పటికి నెల రోజులు దాటేసింది. ఇంకో నెల పూర్తైనా షూటింగులు తిరిగి మొదలయ్యే ఛాన్స్ లేదు.ఏప్రిల్ 20 తర్వాత ఏవో మినహాయింపులు ఉంటాయని చెప్పారు కాని అందులో సినిమా పరిశ్రమ ఉంటుందా లేదా అనే ప్రశ్నకు సమాధానం ఎవరి వద్దా లేదు. ఈ నేపధ్యంలో కెజిఎఫ్ నిర్మాతలు ట్రైలర్ విడుదల లాంటి ప్రణాళిక ఏదీ తమ వద్ద లేదని, అంతా సద్దుమణిగాక తేది దగ్గర పడినప్పుడు అప్పుడు చేస్తామని అంతకు మించి చెప్పడానికి ఏమి లేదన్న తరహలో మెసేజ్ చేశారు.

అదేంటి వచ్చే ఏడాది విడుదలయ్యే ఆర్ఆర్ఆర్ వీడియో టీజర్ ఇంత త్వరగా వదిలితే మరి కెజిఎఫ్ 2 కు ఏమయ్యిందన్న అనుమానం అభిమానుల్లో మొదలైంది. నిజానికి కెజిఎఫ్ 2 షూటింగ్ అయిపోయిందట. పోస్ట్ ప్రొడక్షన్ పీక్స్ లో ఉన్న టైంలో లాక్ డౌన్ వచ్చి పడింది. డిఐతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన కీలకమైన వర్క్ పెండింగ్ లో ఉందట. అసలు ఇండస్ట్రీ జూలైలో కోలుకుంటుందా లేక ఆగస్ట్ లో అంతా సెట్ అవుతుందా ఎవరికి అంతు చిక్కడం లేదు. ఒకవేళ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేకపోతే కేజిఎఫ్ 2 ని డిసెంబర్ కి షిఫ్ట్ చేసే ఆలోచన కూడా ఉందని చెబుతున్నారు.

దీని మొదటి భాగం 2018లో సంచలనం సృష్టించింది ఈ నెలలోనే. సో అదేమీ పెద్ద రిస్క్ కాదు. మరోవైపు శాండల్ వుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇంకా కెజిఎఫ్ 2 బిజినెస్ డీల్స్ పూర్తి కాలేదట. నిర్మాతలు ఆశించిన భారీ ఫిగర్ ని చేరుకునే వరకు ఫైనల్ చేసే ఉద్దేశంలో లేరని వినికిడి. ఇప్పుడు కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది కాబట్టి ఒకవేళ ఏదైనా తేడా కొడితే వాయిదా వేసే ఆలోచన కూడా చేస్తున్నట్టు సమాచారం. అయితే అక్టోబర్ 23కు ఇంకా చాలా టైం ఉంది. ఆరు నెలల సమయం చిన్నది కాదు. సో ఒకవేళ ఏ సినిమా పోస్ట్ పోన్ అయినా కెజిఎఫ్ 2 వర్క్ కనక స్పీడ్ గా పూర్తయితే ప్రకటించిన డేట్ కే రావొచ్చు. పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా ఏదీ చెప్పలేని పరిస్థితి నెలకొంది.