iDreamPost
android-app
ios-app

చంద్రయాన్-3 విజయం వెనుక ఉన్న హీరోలు వీరే..

చంద్రయాన్-3 విజయం వెనుక ఉన్న హీరోలు వీరే..

చంద్రయాన్-3  జాబిల్లి మీద దిగే క్షణం కోసం  దేశ ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఇలా 140 కోట్ల మంది భారతీయుల ఆశలను మోసుకెళ్తూ చంద్రయాన్-3 మీదకు ల్యాండ్ అయింది.  భారత అంతరిక్షయానంలో ఎన్నో ఏళ్ల కళ సాకారం అయింది. అమెరికా, రష్యా, చైనా  సరసన భారత్ కూడా చేరింది. అయితే ఈ మహత్తర  కార్యం వెనుక దాదాపు 1000 మంది ఇంజినీర్ల కృషి ఉందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. అలానే మరెందరో  శాస్త్రవేత్తల కృషి దాగి ఉందని ఆయన అన్నారు. అయితే ఈ చంద్రయాన్-3 ప్రయోగం వెనుక  కొందరు ప్రధానంగా ఉన్నారు. ఈ  చంద్రయాన్-3 వెనుక  ఉన్న మెదస్సు వీళ్లదే. మరి. ఆ హీరోలు ఎవరు.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

ఎస్. సోమనాథ్

ఈయన  ఇస్రో ఛైర్మన్ గా  ఉన్నారు.  ఈ ప్రయోగానికి నాయకుడు ఈయనే. ఎస్ సోమనాథ్ ఎయిరో స్పేస్ ఇంజినీర్. చంద్రయాన్-3ని జాబిలి కక్షలో ప్రవేశపెట్టడానికి  ఉపయోగపడిన బాహుబలి రాకెట్ ని తయారు చేయడంలో ఆయన  కృషి ఎంతో ఉంది.  ఇస్రోలో ఎంతో సమర్ధవంతమైన నాయకునిగా ఈ పని చేస్తున్నారు. చంద్రయాన్-3 విఫలమైనప్పుడు కన్నీరు పెట్టుకున్నారు. ఫెయిల్యూర్ నుంచి గుణపాఠాలు నేర్చుకుని తాజాగా చంద్రయాన్-3ని ఎంతో పటిష్టంగా రూపొందించారు.

ఉన్నికృష్ణన్ నాయర్

ఈయన విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.  చంద్రయాన్-3 రాకెట్ పరిశోధనలో ఈయన మరో కీలక శాస్త్రవేత్త. స్పేస్ లోకి వ్యోమగామిని పంపే కార్యక్రమానికి  ఏరో స్పేస్ ఇంజినీర్. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్  సెంటర్ కు తొలి డైరెక్టర్ గా పని చేస్తున్నారు. గగన్ యాన్ ప్రోగ్రామ్ కోసం అనేక క్లిష్టమైన మిషన్ లకు నాయకత్వం వహించారు.  తాజాగా చంద్రయాన్-3 ప్రయోగంలోని  ప్రధానమైన వారిలో ఈయన ఒకరు.

కే. కల్పన

ఈమే చంద్రయాన్ -3 ప్రయోగానికి డిప్యూటీ డైరెక్టర్ గా తన సేవలను అందించారు. కరోనా విజృంభించిన సమయంలో కూడా చంద్రయాన్-3 పరిశోధన కోసం పట్టుదలతో తన బృందంతో కలిసి పని చేశారు. మన దేశానికి ఉపగ్రహాల తయారీలో తన జీవితాన్ని అంకితం చేశారు. కల్పన చంద్రయాన్-2, మంగళయాన్ మిషన్లలో కూడా పాల్గొన్నారు.

ఎం. వనిత

చంద్రయాన్-3లో యూఆర్ఆరవు సాటిలైట్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ వనిత కృషి కూడా ప్రధానమైనది. వనిత చంద్రయాన్-2 మిషన్‌కు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. జాబిల్లిపై చేసిన ప్రయోగానికి  నాయకత్వం వహించిన తొలి భారత మహిళగా ఈమె గుర్తింపు పొందారు. చంద్రయాన్-2పై ఆమెకున్న జ్ఞానాన్ని చంద్రయాన్‌ 3 విషయంలో ఉపయోగపడింది.

ఎమ్‌ శంకరన్‌:

శంకరన్ ఇస్రో పవర్ హౌస్ ప్రసిద్ధిగాంచారు. కొత్త పవర్ సిస్టమ్‌లు, పవర్ శాటిలైట్‌లకు సౌర శ్రేణులను తయారు చేయడంలో ఈయనకి మంచి అనుభవం ఉంది. ఉపగ్రహాల తయారీలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ఆయన.. చంద్రయాన్-1, మంగళయాన్, చంద్రయాన్-2ల్లో కూడా పనిచేశారు.

వీ నారాయణన్‌..

ఈయన లిక్విడ్ ప్రొషల్షన్ డైరెక్టర్ గా ఆయన పని చేస్తున్నారు. నారాయణన్ లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజిన్‌లను తయారు చేయడంలో నిపుణుడు. విక్రమ్ ల్యాండర్ సేఫ్ గా ల్యాండ్ కావడానికి అవసరమైన థ్రస్టర్‌లను ఈయన నాయకత్వంలో అభివృద్ధి చేశారుచంద్రయాన్-3ని ప్రయోగించిన లాంచ్ వెహికల్ మార్క్ 3తో సహా ఇస్రో తయారు చేసిన చాలా రాకెట్లలో నారాయణన్ మేధస్సు ఉపయోగపడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి