iDreamPost
android-app
ios-app

లీడర్ షిప్ అంటే ఇలాగే ఉండాలి…దటీజ్ కేసియార్

  • Published Mar 30, 2020 | 3:26 AM Updated Updated Mar 30, 2020 | 3:26 AM
లీడర్ షిప్ అంటే ఇలాగే ఉండాలి…దటీజ్ కేసియార్

 దటీజ్ కేసియార్ అని అనిపించుకున్నాడు. లీడర్ షిప్ అంటే ఇలాగే ఉండాలి. మామూలుగా ప్రెస్ ముందుకు తొందరగా రాని తెలంగాణా సిఎం కేసియార్ ఇపుడు మాత్రం వరసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న కొరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించేందుకే వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. ఇందులో భాగంగానే ఆదివారం రాత్రి కూడా మీడియా సమావేశం పెట్టి వివరాలు అందించాడు.

సంక్షోభ సమయంలో యంత్రాంగాన్ని ముందుండి నడిపించేవాడు, జనాలకు ధైర్యాన్ని నూరిపోసేవాడే నిజమైన నాయుకుడు. ఇపుడు కేసియార్ చేస్తున్నది అదే. వైరస్ ప్రపంచ దేశాలను ఎంతగా బెంబేలెత్తిస్తున్నా, దేశంలో స్పీడుగా విస్తరిస్తున్నా కేసియార్ మాత్రం జనాలకు భరోసా ఇస్తున్నట్లే మాట్లాడాడు. ఇపుడున్నట్లే పరిస్ధితి ఉంటే అసలు ఒక్క కేసు కూడా లేకపోతే ఏప్రిల్ 7వ తేదీకల్లా కొరోనా ఫ్రీ స్టేట్ అయిపోతుందని జనాలకు భరోసా ఇచ్చాడు. రేపేం జరుగుతుందో కేసియారే కాదు ఎవ్వరూ చెప్పలేరు. అయినా సరే ఏం కాదు మీకు నేనున్నాను అంటు సిఎం మాట్లాడిన మాటలే జనాలకు కొండంత ధైర్యాన్నిస్తోంది.

ఒక వైపు రాష్ట్రంలో కేసుల సంఖ్య 70 కి చేరుకుంది. అలాగే కొద్దిమంది జనాలు సెల్ఫ్ డిస్టెన్సింగ్ ను పెద్దగా పాటించటం లేదు. మెజారిటి జనాలు ప్రభుత్వాలు చెబుతున్నట్లు వింటున్నా ఆదేశాలను ఉల్లంఘిస్తున్న కొద్దిమంది వల్లే సమస్య పెరిగిపోతోంది. ఈ విషయాన్ని కేసియార్ గట్టిగా వార్నింగులిచ్చారు. అలాగే తమ గ్రామాలకు ఎవరినీ రానిచ్చేది లేదని కంచెలేసుకుని కూర్చున్న వాళ్ళను కూడా సుతిమెత్తగా మందలించారు.

అదే సమయంలో రైతులకు కూడా తీపి కబురు చెప్పాడు. రికార్డు స్ధాయిలో పండిన 40 లక్షల మెట్రిక్ టన్నుల వరి మొత్తాన్నీ ప్రభుత్వమే కొంటుందన్నారు. డబ్బులు కూడా కాస్త అటు ఇటు అయినా బ్యాంకుల్లో జమ చేస్తామని చెప్పారు. మొత్తానికి స్పూర్తిదాయకంగా ఎలా మాట్లాడాలో ఎంత పెద్ద సమస్యనైనా చిన్నదిగా ఎలా చూపించాలో కేసియార్ ను చూసే నేర్చుకోవాలి.

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetholiganbet giriş