iDreamPost
android-app
ios-app

ఆ నలుగురు డ్రాప్ – మాచర్లకు పండగ

  • Published Jul 13, 2022 | 12:05 PM Updated Updated Jul 13, 2022 | 12:05 PM
  • Published Jul 13, 2022 | 12:05 PMUpdated Jul 13, 2022 | 12:05 PM
ఆ నలుగురు డ్రాప్ – మాచర్లకు పండగ

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ సినిమా రిలీజ్ డేట్ కు కట్టుబడుతుందో ఏది డ్రాప్ అవుతుందో చెప్పలేని విచిత్రమైన సందిగ్దత నెలకొంది. వారం పది రోజులు ముందు కూడా వాయిదా తప్పడం లేదు. ఈ కోవలో నిఖిల్, విశాల్ లు వచ్చేశారు. కార్తికేయ 2 ముందు అనుకున్న డేట్ జూలై 22. ఈ తేదీకి రావడం లేదని ముందే లీక్స్ ఇచ్చారు కానీ ఇవాళ అఫీషియల్ గా చెప్పేశారు. ఆగస్ట్ 5 ఆల్మోస్ట్ లాక్ చేశారు కానీ అదే రోజు బింబిసార, సీతా రామమ్ లు ఉండటంతో ఇంకొంత ఆలోచించి డెసిషన్ చెప్పే అవకాశాలున్నాయి. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ ఫాంటసీ డ్రామా ద్వారా బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అనుపమ్ ఖేర్ టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు.

ఇక విశాల్ లాఠీ రావాల్సిన తేదీ ఆగస్ట్ 12. ఇదీ వాయిదా పడింది. తాజాగా సెప్టెంబర్ 15కి షిఫ్ట్ చేయాలని చూస్తున్నారు. విశాల్ కు షూటింగ్ సందర్భంగా పలుమార్లు గాయాలు కావడం, విఎఫ్ఎస్ ఎఫెక్ట్స్ లో జరిగిన ఆలస్యం వల్ల టార్గెట్ కి రీచ్ కావడం కష్టమని అర్థమైపోయింది. దానికి తోడు ఒక రోజు ముందు విక్రమ్ కోబ్రా తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. దాంతో పోటీకి వెళ్తే లేనిపోని రిస్క్. పైగా విశాల్ మార్కెట్ మునుపటిలా లేదు. తెలుగులో ఎప్పుడో డౌన్ అయ్యింది. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా సైతం రేస్ లో ఉండటంతో లాఠీ తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి కరెక్టే. సో నిఖిల్ విశాల్ లు తెలివైన పనే చేశారు.

సమంతా యశోద సైతం ఆగస్ట్ 12 నుంచి కొత్త తేదీకి షిఫ్ట్ కానుంది. ఇంకా ఫైనల్ చేయలేదు. పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం అయ్యాక చెబుతారు. ఆల్రెడీ అఖిల్ ఏజెంట్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీళ్లందరి వల్ల నితిన్ మాచర్ల నియోజకవర్గంకు పెద్ద అడ్వాంటేజ్ దక్కనుంది. సోలోగా లాంగ్ వీకెండ్ ని ఎంజాయ్ చేయబోతున్నాడు. మొన్నటిదాకా పెద్ద బజ్ లేదు కానీ ఇటీవలే రిలీజ్ చేసిన రారా రెడ్డి ఐటెం సాంగ్ మాస్ కి బాగా ఎక్కేయడంతో ప్రేక్షకుల దృష్టిలో పడింది. నితిన్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో ఇది రూపొందింది. మొత్తానికి నిఖిల్, విశాల్, సమంతా, అఖిల్ తప్పుకోవడంతో నితిన్ కి రూట్ క్లియర్ అయ్యింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetbaba girişgrandpashabet