iDreamPost
android-app
ios-app

ఆమెకి ఇద్దరు భర్తలు! ఆఫీస్ లో మరో ప్రియుడు! చివరికి!

వీళ్లిద్దరు గతంలో వేరు వేరు వ్యక్తులను పెళ్లిళ్లు జరిగాయి. ఒకే ప్రాంతంలో పని చేయడంతో కాస్త పరిచయం పెరిగింది. ఆ పరిచయంతోనే కట్టుకున్నవాళ్లను కాదని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. కానీ, చివరికి జరిగింది ఏంటంటే?

వీళ్లిద్దరు గతంలో వేరు వేరు వ్యక్తులను పెళ్లిళ్లు జరిగాయి. ఒకే ప్రాంతంలో పని చేయడంతో కాస్త పరిచయం పెరిగింది. ఆ పరిచయంతోనే కట్టుకున్నవాళ్లను కాదని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. కానీ, చివరికి జరిగింది ఏంటంటే?

ఆమెకి ఇద్దరు భర్తలు! ఆఫీస్ లో మరో ప్రియుడు! చివరికి!

కర్ణాటకలోని విజయనగరంకు చెందిన వీళ్లిద్దరూ ఒకే ప్రాంతంలో పని చేస్తుండేవారు. కొద్దిపాటి పరిచయంతోనే మంచి స్నేహితులుగా మారిపోయారు. ఇక ఇదే పరిచయం రాను రాను ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. దీంతో కట్టుకున్న వాళ్లను లెక్క చేయకుండా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఇంతే కాకుండా అప్పుడప్పుడు శారీరకంగా కలుసుకునేవారు. అలా వీరిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా మారిపోవడంతో గతంలో పెళ్లి కూడా చేసుకున్నారు. అప్పటి నుంచి వీరు సీక్రెట్ గా కాపురాన్ని కొనసాగించారు. కానీ, ఆ చిన్న పొరపాటే చివరికి ఈ మహిళను ప్రాణాలతో లేకుండా చేసింది. ఇంతకు ఈ మహిళ ఎలా చనిపోయింది. ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని విజయనగరం జిల్లా పూల నౌకలో డింపుల్ (26) అనే మహిళ నివాసం ఉంటుంది. ఈమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. ఆమెకు ఇది రెండో వివాహం కావడం విశేషం. అయితే, డింపుల్ విజయనరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ డిపార్ట్మెంట్ లో పని చేస్తుండేది. పక్క ప్రాంతమైన నెల్లుకుదూరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న శ్రీకాంత్ అనే వ్యక్తి డింపుల్ కు పరిచయం అయ్యాడు. వీరిద్దరి పరిచయం చివరికి ప్రేమగా మారింది. దీంతో ఎలాగైన వీళ్లు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అనుకున్నట్లే ఈ ప్రేమికులు గతంలో ఓ గుడిలో సీక్రెట్ గా వివాహం చేసుకున్నారు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే? శ్రీకాంత్ కు ఇది వరకే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ఇక అప్పటి నుంచి వీళ్లు ఒకే గదిలో ఉంటూ సీక్రెట్ గా కాపురం పెట్టారు. ఇదిలా ఉంటే.. గత కొంత కాలం నుంచి వీరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఇకపోతే. ఈ భార్యాభర్తలు ఇటీవల మరోసారి గొడవ పడ్డారు. క్షణికావేశంలో ఊగిపోయిన శ్రీకాంత్.. డింపుల్ ను అతి దారుణంగా హత్య చేశాడు. భార్య చనిపోయిన విషయం తెలుసుకున్న శ్రీకాంత్.. ఏం చేయాలో తెలియక స్థానిక పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అనంతరం జరిగిందంతా వారికి వివరించాడు. దీంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు షాక్ కు గురై కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక చేసేదేం లేక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా డింపుల్ ను అతి దారుణంగా హత్య చేసిన శ్రీకాంత్ ను కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet