iDreamPost
android-app
ios-app

Karate Kalyani-YouTuber Srikanth Reddy యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డితో కరాటే కల్యాణి స్ట్రీట్ ఫైట్.. అసలేం జరిగింది ?

Karate Kalyani-YouTuber Srikanth Reddy యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డితో కరాటే కల్యాణి  స్ట్రీట్ ఫైట్.. అసలేం జరిగింది ?

టాలీవుడ్ నటి కరాటే కల్యాణి – యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి లు గురువారం రాత్రి హైదరాబాద్ యూసుఫ్ గూడ బస్తీలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కరాటే కల్యాణితో పాటు.. కొందరు శ్రీకాంత్ రెడ్డిని వెంటాడి మరీ చితకబాదారు. శ్రీకాంత్ రెడ్డి సోషల్ మీడియాలో వల్గర్ వీడియోలు పోస్టు చేస్తున్నాడ‌ని, అమ్మాయిలు, ఆంటీలంటూ, వాళ్లతో సెక్స్ గురించి మాట్లాడటం, బూతులు మాట్లాడుతూ.. ఫ్రాంక్ వీడియోలు తీసి, ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యూట్యూబ్ లో పాపులర్ అయ్యాడ‌ని క‌రాటే క‌ళ్యాణి అంటున్నారు.

ఆ ఫ్రాంక్ వీడియోలు చూసిన కరాటే కల్యాణికి చిర్రెత్తింది. మహిళల్ని, హిందువుల‌ని అగౌరవపరిచేలా ఫ్రాంక్ వీడియోలు తీస్తావా ? సమాజాన్ని ఏం చేద్దామనుకుంటున్నావ్ ? అంటూ చెంపపగలగొట్టింది. కల్యాణితో వచ్చిన వాళ్లు కూడా శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేశారు. దాంతో తిరగబడిన శ్రీకాంత్ రెడ్డి.. కరాటే కల్యాణిని చెంపమీద కొట్టాడు. ఈ కొట్లాటలో చేతిలో చంటిబిడ్డతో, కిందపడిపోయింది. మళ్లీ లేచి.. శ్రీకాంత్ రెడ్డిని కొట్టింది.

ఫ్రాంక్ వీడియోలు తీయడం ఇష్టంలేకపోతే కంప్లైంట్ చేయాలి గానీ, నన్ను కొట్టే హక్కు మీకు ఎక్కడిదని ప్రశ్నించాడు శ్రీకాంత్ రెడ్డి. కరాటే కల్యాణితో వీడియో తీసుకోవడానికి డబ్బులు అడిగిందని, అవి ఇవ్వకపోవడంతోనే తనపై దాడిచేసిందని ఆరోపిస్తున్నాడు శ్రీకాంత్ రెడ్డి. దానికి బ‌ద‌లిచ్చింది క‌రాటే క‌ళ్యాణి. శ్రీకాంత్ రెడ్డి ఒంటరిగా ఉన్న ఆడపిల్లలతో కామకోరికలు కలిగేలా మాట్లాడి, తన కోరికలు తీర్చుకుంటున్నాడని, అందుకే కొట్టినట్లు చెబుతోంది.

దాడి తర్వాత ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి