iDreamPost
android-app
ios-app

కాంతార చాప్టర్ 1 చాలా తేలిగ్గా 300 కోట్లు

  • Published Oct 06, 2025 | 11:52 AM Updated Updated Oct 06, 2025 | 11:52 AM

కొన్ని కాంట్రవర్సీల మధ్యన కాంతారా చాప్టర్ 1 రిలీజ్ అయింది. ఊహించని విధంగా మొదటి వీకెండ్ చాలా సక్సెసఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఒక్కసారి సినిమా మొదటి షో పడిన తర్వాత.. అప్పటివరకు వచ్చిన కాంట్రవర్సీ , నెగెటివిటి అంతా తుడిచిపెట్టుకునిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి.

  • Published Oct 06, 2025 | 11:52 AMUpdated Oct 06, 2025 | 11:52 AM
కాంతార చాప్టర్ 1 చాలా తేలిగ్గా 300 కోట్లు

కొన్ని కాంట్రవర్సీల మధ్యన కాంతారా చాప్టర్ 1 రిలీజ్ అయింది. ఊహించని విధంగా మొదటి వీకెండ్ చాలా సక్సెసఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఒక్కసారి సినిమా మొదటి షో పడిన తర్వాత.. అప్పటివరకు వచ్చిన కాంట్రవర్సీ , నెగెటివిటి అంతా తుడిచిపెట్టుకునిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మొదటి వీకెండ్ వరకు ఏ సినిమా అయినా తట్టుకుని నిలబడుతుంది. కాని అసలు టెస్ట్ మండే నుంచే మొదలవుతుంది. ఒకవేళ వీక్ డేస్ టెస్ట్ పాస్ అయితే కనుక ఇక సినిమా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.

ఇక ఇప్పటివరకు కలెక్ట్ చేసుకున్న లెక్కల విషయానికొస్తే.. ఈ నాలుగు రోజుల్లోనే మూవీ అటు ఇటుగా మూడు వందల ఇరవై కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అందుకుంది. ఇది అన్ని భాషల కలిపి కలెక్షన్స్. దీనిని తక్కువ అంచనాలు వేయడానికి లేదు. ఎందుకంటే రిలీజ్ కు ముందు వరకు దీనికి వచ్చిన నెగెటివ్ టాక్ అంతా ఇంతా కాదు. దానితో కంపేర్ చేస్తే ఇది పెద్ద నెంబరే. మొదటి రోజు నుంచే ఆన్ లైన్ బుకింగ్స్ లో జోరు చూపించడం మరో చెప్పుకోదగిన విషయం.

ప్రస్తుతానికి కాంతారా చాప్టర్ 1 .. 300 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇక నెక్స్ట్ టార్గెట్ 500 కోట్ల క్లబ్ లో చేరడమే. నెక్స్ట్ వీకెండ్ కు ఇది కూడా కంప్లీట్ అయిపోతుందని టీం స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. ప్రస్తుతానికి వచ్చే వారం వరకు కొత్త సినిమాలు ఏమి లేవు. కాబట్టి కాంతారా స్పీడ్ ఇప్పటిలో తగ్గదు. థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యేలోపు ఎంత రాబడుతుంది అనేది చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.