iDreamPost
android-app
ios-app

జక్కన్న బాహుబలి ఎపిక్ ప్లానింగ్ అదిరిందిగా

  • Published Oct 04, 2025 | 4:06 PM Updated Updated Oct 04, 2025 | 4:06 PM

ఓ సినిమాను పక్కా ప్లానింగ్ తో తీయాలన్నా , ప్రోమోట్ చేయాలన్నా , రికార్డ్స్ కొల్లగొట్టాలన్నా రాజమౌళి తర్వాతే ఎవరైనా. ఇప్పుడు రీరిలీజ్ లోను రాజమౌళి తన మార్క్ ను సెట్ చేసేలా ఉన్నాడు. సహజంగా రీరిలీజ్ లంటే దర్శక నిర్మాతలు ఓ ప్రెస్ మీట్ పెట్టి.. ఇంటర్వ్యూస్ పెట్టి సినిమాను రీరిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ రాజమౌళి దానికి కాస్త భిన్నంగా చేస్తున్నాడు. నెట్ ఫ్లిక్స్ నుంచి బాహుబలి రెండు పార్ట్శ్ హిందీ వెర్షన్స్ ను తీసేసాడు.

  • Published Oct 04, 2025 | 4:06 PMUpdated Oct 04, 2025 | 4:06 PM
జక్కన్న బాహుబలి ఎపిక్ ప్లానింగ్ అదిరిందిగా

ఓ సినిమాను పక్కా ప్లానింగ్ తో తీయాలన్నా , ప్రోమోట్ చేయాలన్నా , రికార్డ్స్ కొల్లగొట్టాలన్నా రాజమౌళి తర్వాతే ఎవరైనా. ఇప్పుడు రీరిలీజ్ లోను రాజమౌళి తన మార్క్ ను సెట్ చేసేలా ఉన్నాడు. సహజంగా రీరిలీజ్ లంటే దర్శక నిర్మాతలు ఓ ప్రెస్ మీట్ పెట్టి.. ఇంటర్వ్యూస్ పెట్టి సినిమాను రీరిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ రాజమౌళి దానికి కాస్త భిన్నంగా చేస్తున్నాడు. నెట్ ఫ్లిక్స్ నుంచి బాహుబలి రెండు పార్ట్శ్ హిందీ వెర్షన్స్ ను తీసేసాడు.

అలాగే క్యాస్టింగ్ , టెక్నీకల్ టీంతో కొన్ని ఇంటర్వ్యూస్ షూట్ చేశారు. ఘాటీ ప్రమోషన్స్ కే రాణి అనుష్క ఇప్పుడు బాహుబలి ఎపిక్ ప్రమోషన్స్ కు ఇంటర్వూస్ ఇచ్చిందని ఇన్సైడ్ టాక్. అలాగే ప్రభాస్, రానా, సత్యరాజ్, రామకృష్ణ తదితరుల ప్రోగ్రాంస్ తో పాటు మేకింగ్ వీడియోస్ ను రిలీజ్ చేయనున్నారట. ఇలా దీనికోసం రాజమౌళి అండ్ టీమ్ చాలా కష్టపడుతున్నారట. అక్టోబర్ 31 విడుదల కాబోతున్న బాహుబలి ది ఎపిక్ కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇది రీరిలీజ్ ల కాకుండా.. ఓ స్ట్రెయిట్ మూవీ రేంజ్ లో రిలీజ్ కాబోతుంది. ఇంత శ్రద్దగా రిలీజ్ చేయడం వెనుక రాజమౌళి ఆలోచన ఒకటే. ఈ సినిమాను రీరిలీజ్ ల కాకుండా.. ఓ స్టాండ్ ఎలోన్ మూవీగా ప్రేక్షకులకు పరిచయం చేయాలి అనుకోడమే. కొన్ని వందల సార్లు చూసిన ఈ సినిమాను మరోసారి వెండితెరపై చూసినప్పుడు కూడా.. ప్రేక్షకులు కొత్తగా ఫీల్ అయ్యేలా చేయబోతున్నారట దర్శకుడు. ప్రభాస్ ఫ్యాన్స్ దీనిని భారీ రేంజ్ లో సెలెబ్రేట్ చేయబోతున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.