Swetha
టాలీవుడ్ ఈసారి వరుస ఫ్లాపుల బాట పట్టింది. అదేంటో తెలీదు కానీ రిలీజ్ ముందు వరకు బాగా హైప్ ఉన్న సినిమాలు కూడా రిలీజ్ రోజు బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా పడుతున్నాయి. జనవరి తరవాత మళ్ళీ సెప్టెంబర్ లోనే థియేటర్స్ కళకళలాడాయి. మధ్యలో కొన్ని సినిమాలు క్రౌడ్ పుల్లింగ్ చేసాయి
టాలీవుడ్ ఈసారి వరుస ఫ్లాపుల బాట పట్టింది. అదేంటో తెలీదు కానీ రిలీజ్ ముందు వరకు బాగా హైప్ ఉన్న సినిమాలు కూడా రిలీజ్ రోజు బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా పడుతున్నాయి. జనవరి తరవాత మళ్ళీ సెప్టెంబర్ లోనే థియేటర్స్ కళకళలాడాయి. మధ్యలో కొన్ని సినిమాలు క్రౌడ్ పుల్లింగ్ చేసాయి
Swetha
టాలీవుడ్ ఈసారి వరుస ఫ్లాపుల బాట పట్టింది. అదేంటో తెలీదు కానీ రిలీజ్ ముందు వరకు బాగా హైప్ ఉన్న సినిమాలు కూడా రిలీజ్ రోజు బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా పడుతున్నాయి. జనవరి తరవాత మళ్ళీ సెప్టెంబర్ లోనే థియేటర్స్ కళకళలాడాయి. మధ్యలో కొన్ని సినిమాలు క్రౌడ్ పుల్లింగ్ చేసాయి. కానీ ఓ సినిమా హిట్ అయితే మరో సినిమా ప్లాప్ అయ్యేది. కానీ సెప్టెంబర్ అలా కాదు. లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి విజయాలు బాక్స్ ఆఫీస్ కు ప్రాణం పోశాయి. దానికి తోడు ఈ ఇయర్ లోనే బిగ్గెస్ట్ హైప్ తో వచ్చిన ఓజి మూవీ బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ గా నిలిచింది. ఇలా మొత్తానికి 2025 సెప్టెంబర్ నెల మూవీ లవర్స్ కు బాగా గుర్తుండిపోతుంది.
ఇక అక్టోబర్ విషయానికొస్తే.. కాంతారతో గుడ్ స్టార్ట్ దొరికింది. దసరా సీజన్ అవ్వడంతో థియేటర్స్ ఇంకాస్త సందడిగా మారాయి. ప్రస్తుతానికైతే ఈ సినిమానే ఉంది. వచ్చేవారం మాత్రం బాక్స్ ఆఫీస్ ఖాళీగా ఉండబోతుంది. ఆ తర్వాత మళ్ళీ సందడి కనిపించబోయేది దీపావళి సీజన్ లోనే. ‘కే ర్యాంప్’, ‘డ్యూడ్’, ‘తెలుసు కదా’, ‘మిత్రమండలి’ లాంటి సినిమాలు రానున్నాయి. నాలుగు మిడ్ రేంజ్ సినిమాలే అయినా కూడా కంటెంట్ ఉన్న సినిమాలు కాబట్టి.. ప్రేక్షకులు థియేటర్స్ కు వచ్చే అవకాశలు లేకపోలేదు.
ఒకసారి సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే మొదటి వీకెండ్ వరకు బాగానే హోల్డ్ కనిపిస్తుంది. ఇక ఈ నెల ఎలా జరుగుతుందో చూడాలి. ఈ సినిమాలతో పాటు ఇదే నెలలో బాహుబలి ఎపిక్ కూడా వస్తోంది. పార్ట్-1, పార్ట్-2ను కలిపి ఎపిక్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది పెద్ద పండగ. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.