iDreamPost
android-app
ios-app

బాలీవుడ్, సౌత్ మధ్య తేడా అదే.. బాలీవుడ్ హీరోలు బాయిల్డ్ ఎగ్స్ లా ఉంటారా? కంగ‌నా అంత‌మాట అనేసిందేంటి?

  • Published May 16, 2022 | 5:24 PM Updated Updated May 16, 2022 | 6:12 PM
  • Published May 16, 2022 | 5:24 PMUpdated May 16, 2022 | 6:12 PM
బాలీవుడ్, సౌత్ మధ్య తేడా అదే.. బాలీవుడ్ హీరోలు బాయిల్డ్ ఎగ్స్ లా ఉంటారా? కంగ‌నా అంత‌మాట అనేసిందేంటి?

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సమయం దొరికినప్పుడల్లా బాలీవుడ్ స్టార్ హీరోల మీద, బాలీవుడ్ స్టార్ కిడ్స్ మీద విమర్శలు చేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం కంగనా ధాకడ్ సినిమాతో మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది కంగనా. గత వారం రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ లో సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి బాలీవుడ్ హీరోలు, స్టార్ల పిల్లల గురించి వ్యాఖ్యలు చేసింది.

కంగనా మాట్లాడుతూ.. సౌత్ సినిమా వాళ్లు ఆడియన్స్‌తో కనెక్ట్‌ అయ్యేలా సినిమాలు చేస్తున్నారు. అక్కడి నటీనటులు ఎలాంటి పాత్రల్లోనైనా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఉదాహరణకి ఇటీవల వచ్చిన ‘పుష్ప’ సినిమాలో హీరో కూలీ పని చేసే వ్యక్తిగా కనిపించాడు. మన హీరోలు అలా చేస్తారా? దక్షిణాది సినిమాల్లో మన సంస్కృతి, సంప్రదాయాలకు విలువ ఇస్తారు. అవి దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా చేస్తాయి అని అన్నారు.

ఇక బాలీవుడ్ స్టార్ కిడ్స్ గురించి మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌ లో వచ్చే సినిమాల్లో చాలా వరకు బీటౌన్‌ స్టార్ల పిల్లలే నటిస్తున్నారు. చదువుల కోసం చిన్నప్పటి నుంచి విదేశాల్లో ఉన్న వాళ్లకి, పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడిన వాళ్లకి ఇక్కడి పద్ధతులు ఎలా తెలుస్తాయి. వాళ్ల భాష, ఆహరం అన్ని వేరు. వాళ్ల లుక్స్‌ కూడా భయంగా, ఉడకబెట్టిన కోడిగుడ్లలా ఉంటాయి. అలాంటప్పుడు మన ప్రేక్షకులు వాళ్ళకి ఎందుకు కనెక్ట్‌ అవుతారు అని కంగన చెప్పడంతో ఈ వ్యాఖ్యలు మరోసారి బాలీవుడ్ లో చర్చకు దారి తీశాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetdedebet girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio