iDreamPost
android-app
ios-app

Abhay 3D ఫ్లాప్ మూవీకి త్రీడి ఎఫెక్ట్స్

  • Published Jul 14, 2022 | 6:55 PM Updated Updated Jul 14, 2022 | 6:55 PM
Abhay 3D ఫ్లాప్ మూవీకి త్రీడి ఎఫెక్ట్స్

సినిమాలు ఎన్ని చూసినా త్రీడిలో చూస్తే వచ్చే ఫీలింగ్ వేరే. ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీస్ థార్ లవ్ అండ్ థండర్, జురాసిక్ వరల్డ్ డామినియన్ లు పిల్లలు పెద్దలు ఎంతగా ఎంజాయ్ చేశారో గమనించాం. అయితే తెలుగు తమిళంలో ఈ తరహాలో వచ్చేవి చాలా తక్కువ. రజినీకాంత్ 2.0ని ఈ మోడల్ లోనే రిలీజ్ చేశారు కానీ అది ఆశించినంత ఫలితం అందుకోలేకపోవడంతో ఆ అనుభూతి గొప్పగా నిలవలేకపోయింది. గతంలోనూ బాహుబలి, శివాజీలను 3డిలో మార్చి రీ రిలీజ్ చేసినా జనం అంతగా రిసీవ్ చేసుకోలేదు. ఆర్ఆర్ఆర్ సైతం పరిమితంగానే రీచ్ అయ్యింది. మేమూహించినంత స్థాయిలో త్రీడి ఎఫెక్ట్స్ లేవని ఫ్యాన్స్ ఫీలయ్యారు.

సరే పైన చెప్పినవన్నీ హిట్ సినిమాలు కాబట్టి ఏదో మిస్ అయినా ఫైనల్ గా పాస్ అయినవే. కానీ ఒక ఫ్లాప్ మూవీకి కొత్తగా త్రీడి చేసే ప్రయత్నం చేయడం మాత్రం షాకే. 2001లో వచ్చిన కమల్ హాసన్ ఆళవందాన్ ని ఇప్పుడీ టెక్నాలజీతో అప్ డేట్ చేయబోతున్నారు. ఇది తెలుగులో అభయ్ గా డబ్ అయ్యింది. ఒరిజినల్ వెర్షనే పెద్దగా ఆడలేదు. ఇక్కడేమో భారీ నష్టాలు తెచ్చిన డిజాస్టర్. కమల్ తనే స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాసిన సినిమా ఇది. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. రవీనా టాండన్, మనీషా కొయిరాలా హీరోయిన్లు. లోకనాయకుడిది ఇందులో డ్యూయల్ రోల్. గుండుతో భయపెట్టేలా ఉండే సైకో విలన్ గా కమల్ నటన వేరే లెవెల్ లో ఉంటుంది.

ఇప్పుడీ అభయ్ ని త్రీడిలో మార్చి నవంబర్ 7న రిలీజ్ చేస్తారు. దీని బదులు భారతీయుడు, విచిత్ర సోదరులు, దశావతారం లాంటివి చేస్తే బాగుండేదన్న అభిప్రాయం లేకపోలేదు. అప్పుడు ఆడలేదు కానీ అభయ్ ని అభిమానులు చాలా స్పెషల్ గా కన్సిడర్ చేస్తారు. దీనికి విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో జాతీయ అవార్డు వచ్చింది. అందుకే మరోసారి ఆ ఎక్స్ పీరియన్స్ ని బిగ్ స్క్రీన్ మీద 3D ఎఫెక్ట్ తో ఇవ్వాలని టీమ్ నిర్ణయించుకుంది. సరే ఇరవై ఏళ్ళ క్రితం జనానికి నచ్చలేదు. ఇప్పుడు ఓటిటిలు వచ్చి సాంకేతికత పెరిగి ఆడియన్స్ అభిరుచులు మారాయి కాబట్టి అభయ్ ప్రెజెంట్ జెనరేషన్ కి ఏమైనా నచ్చుతుందేమో లెట్ వెయిట్ అండ్ సీ