అమిత్ షాతో భేటీ కానున్న జూనియర్ ఎన్టీఆర్.. కారణం..?

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. తొలుత అనుకున్న పొత్తులు, మాటలు, సీటు సర్దుబాట్లు ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత మారిపోతున్నాయి. బీజెపీ-జనసేన, కాంగ్రెస్-వైఎస్సార్టీపీ, బీఆర్ఎస్-ఎంఐఎంలు జట్టుకట్టాయి.

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. తొలుత అనుకున్న పొత్తులు, మాటలు, సీటు సర్దుబాట్లు ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత మారిపోతున్నాయి. బీజెపీ-జనసేన, కాంగ్రెస్-వైఎస్సార్టీపీ, బీఆర్ఎస్-ఎంఐఎంలు జట్టుకట్టాయి.

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొలదీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు గతం కంటే వేగంగా మారుతున్నాయి. ఇక్కడి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజెపీ, జనసేన పొత్తు కుదిరింది. ఇదే సమయంలో అధికార బీఆర్ఎస్‌కు మద్దుతు తెలిపింది ఎంఐఎం. ఇక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై.. నామినేషన్ పర్వం మొదలైంది అనగానే.. తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. ఈ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తామని తెలుస్తోంది. అయితే ఇప్పటికే అభ్యర్థులు ప్రకటన, మ్యానిఫెస్టోలు విడుదల చేసిన ఆయా పార్టీలు ప్రచారాలను ముమ్మరం చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఇప్పుడొక ఆసక్తికరమైన అంశం నెలకొంది.  జూనియర్ ఎన్టీఆర్.. అమిత్ షాతో భేటీ కాబోతున్నారన్నదే ఈ సారాంశం. అయితే తెలంగాణలో ఇంకా బీజెపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు కుదరలేదు. తొలుత 32 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది జనసేన. అయితే బీజెపీతో మంతనాలు జరిపిన తర్వాత.. పొత్తు ఖరారైంది. దీంతో 9 నుండి 11 స్థానాలను బీజెపీ ఇస్తామని చెబుతుండగా.. కనీసం 20 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన. హైదరాబాద్ పరిధిలోని కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ సీట్లను తమ పార్టీ అభ్యర్థులకు కేటాయించాలన్న వినతిని.. బీజెపీ అధిష్టానం ముందు ఉంచింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇటలీలో వరుణ్ తేజ్ వివాహానికి హాజరైన నేపథ్యంలో.. తిరిగి వచ్చిన తర్వాత.. దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అయితే ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ ఖరారు అయ్యింది. అయితే ఈ అపాయింట్‌మెంట్ ఎన్టీఆర్ కోరితే జరిగిందా.. ఎన్నికల నేపథ్యంలో అమిత్ షానే ఆయన్ను కలవనున్నారా అన్న సందిగ్దత నెలకొంది. గతంలో కూడా వీరిద్దరూ సమావేశమయ్యారు. అప్పటి సమావేశంలో బీజెపీలోకి రావాలని, ముఖ్యమంత్రి అభ్యర్థి మీరేనని కోరగా.. రాజకీయాలకు ఇప్పుడే రానని, 4-5 సంవత్సరాలు తర్వాత వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఎప్పుడూ వచ్చిన వార్మ్ వెల్కమ్ ఉంటుందని చెప్పారట అమిత్ షా. అప్పట్లో కనీసం ప్రచారం చేయమని కోరినా నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు సమావేశం ఈ నేపథ్యంలోనే జరగనుందని తెలుస్తోంది. తెలంగాణలో బీజెపీ స్టార్ క్యాంపెనర్‌గా రావాలని కోరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. లేదంటే ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు కనుక.. ఇప్పట్లో రాజకీయాల్లోకి రానని  తన మనస్సులోని మాట చెప్పేందుకు ఎన్టీఆర్ వెళుతున్నారా అనేది తెలియాల్సి ఉంది.

Show comments