Swetha
టాలీవుడ్ లో తారక్ కు ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు తారక్ వార్ 2 తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీనితో తారక్ ఫ్యాన్స్ అంతా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరి ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్ లో తారక్ కు ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు తారక్ వార్ 2 తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీనితో తారక్ ఫ్యాన్స్ అంతా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరి ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
Swetha
RRR తో ఎన్టీఆర్ స్థాయి పాన్ ఇండియా వరకు చేరుకుంది. సౌత్ నార్త్ తేడా లేకుండా ప్రతి ఒక్కరు తారక్ డ్యాన్స్ , యాక్టింగ్ కు ఫిదా అయిపోతున్నారు. ఇలా అందరిని ఆకట్టుకుంటున్న తారక్ డైరెక్ట్ గా బాలీవుడ్ లో నటించడంతో అందరికి ఆ సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు తారక్ ను బాలీవుడ్ తెర మీద చూద్దామా అని ప్రేక్షకులంతా కళ్ళలో ఒత్తులు వేసుకుని మరి ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కు తారక్ కు మధ్య ఎలాంటి సీన్స్ ఉండబోతున్నాయా అందరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు చాలానే మల్టి స్టారర్ సినిమాలు చూసాము కానీ ఈ కాంబో మాత్రం కాస్త స్పెషల్ అని చెప్పి తీరాల్సిందే. ఇక ఆల్రెడీ వార్ 2 కు సంబందించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. ఆగష్టు లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి డిసైడ్ అయ్యారు మేకర్స్.
రీలీజ్ సమయం దగ్గరపడుతున్న కూడా ఇప్పటివరకు మూవీ నుంచి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయకపోవడంతో… అభిమానులలో కాస్త నిరాశ నెలకొన్న మాట వాస్తవం. దీనితో ఈ విషయంలో అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో మే 20 ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా వార్ 2 సినిమాకు సంబందించిన స్పెషల్ వీడియోను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇది కాకుండ తారక్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా నుంచి కూడా.. ఏదైనా అప్డేట్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వార్ 2 నుంచైతే కచ్చితంగా ఎదో ఒక అప్డేట్ ఉంటుంది. కానీ ప్రశాంత్ నీల్ తారక్ బర్త్ డే గిఫ్ట్ గా ఫ్యాన్స్ కు ఏమి ఇస్తున్నారు అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. సో మొత్తానికి ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ కు పెద్ద గిఫ్ట్ ఏ ఉండబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో తెలుగు హీరోలు తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు. ఇక ఇప్పడు వార్ 2 మూవీతో తెలుగు హీరోల స్థాయి అక్కడ ఇంకాస్త పెరుగుతుందని చెప్పి తీరాల్సిందే. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.