Swetha
బాలీవుడ్ నుంచి వచ్చిన బిగ్ అప్డేట్ తారక్ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం నింపింది. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే మరో అప్డేట్ అందరిని డైలమాలో పడేసింది. అదే దాదా సాహెబ్ ఫాల్కే బయో పిక్ మ్యాటర్. బాలీవుడ్ నుంచి వచ్చిన మరో అప్డేట్ ఏంటో చూసేద్దాం.
బాలీవుడ్ నుంచి వచ్చిన బిగ్ అప్డేట్ తారక్ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం నింపింది. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే మరో అప్డేట్ అందరిని డైలమాలో పడేసింది. అదే దాదా సాహెబ్ ఫాల్కే బయో పిక్ మ్యాటర్. బాలీవుడ్ నుంచి వచ్చిన మరో అప్డేట్ ఏంటో చూసేద్దాం.
Swetha
భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జీవిత చరిత్రను అందరికి తెలియజేయాలి అనుకోవడం.. చాలా గొప్ప నిర్ణయం అని చెప్పి తీరాలి. ఈ క్రమంలో ఈ బయో పిక్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. దీనితో తారక్ అభిమానులంతా గర్వంగా ఫీల్ అయ్యారు. అసలు ఎలా ఉండబోతుంది .. ఎవరు దర్శకత్వం వహించబోతున్నారు.. ఎప్పుడు ఉండబోతుంది అనే ఎన్నో ప్రశ్నలు వారిలో మెదిలాయి. త్వరలోనే దీనికి సంబందించిన ఎదో ఓ అప్డేట్ ఉండబోతుందని అంతా అనుకున్నారు. కానీ ఇంతలోనే బాలీవుడ్ నుంచి మరో బిగ్ అప్డేట్ అందరిని డైలమాలో పడేసింది.
అదేంటంటే ఈ బయోపిక్ ను అమీర్ ఖాన్ చేస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ఇప్పుడు ఈ బయోపిక్ మ్యాటర్ ప్రస్నార్ధకంగా మారిందని చెప్పి తీరాల్సిందే. నిజానికి రెండేళ్ల క్రియేటమే రాజమౌళి సమర్పణలో మెడ్ ఇన్ ఇండియా అనే ప్రాజెక్ట్ ను ప్రకటించారు. దీనికి నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తారని వెల్లడించారు కూడా. కానీ అప్పుడు ఈ సినిమాలో హీరో ఎసరు అనే విషయం మాత్రం బయటకు రానివ్వలేదు. ఇప్పుడు ఇన్నాళ్ళకి ఈ మూవీలో తారక్ హీరోగా ఉండబోతున్నాడనే వార్తలు వచ్చాయి. ఇలాంటి బయోపిక్స్ లో తారక్ సెట్ అవుతాడా ఎలా ఉండబోతుంది అనే ఆలోచించేలోపే.. అమీర్ ఖాన్ పేరు కూడా బయటకు వచ్చింది. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దీనికి దర్శకత్వం వహించనున్నారని బాలీవుడ్ మీడియా తెలిపింది.
దీనితో ఇప్పుడు ఈ ఇద్దరి హీరోల మధ్య బయో పిక్ వార్ మొదలైంది. ఇంతకీ ఈ మూవీని ఎవరు తెరకెక్కిస్తున్నారు. ఎవరు హీరోగా ఉండబోతున్నారు. లేదా ఎవరి వెర్షన్ లో వారు దీనిని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారా… అనే సందేహాలు అందరిలో మొదలయాయ్యి. ఇక ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.