iDreamPost
android-app
ios-app

వారికి అమెజాన్ గుడ్ న్యూస్.. ట్రైనింగ్‌తోపాటు ఉద్యోగాలు!

వారికి అమెజాన్ గుడ్ న్యూస్.. ట్రైనింగ్‌తోపాటు ఉద్యోగాలు!

టెక్నాలజీలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో జీవన శైలి సులభతరమైపోయింది. ఏ వస్తువు కావాలన్నా క్షణాల్లో ఇంటికే తెప్పించుకునే అవకాశం ఏర్పడింది. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఇంకా ఇతర ఈ కామర్స్ సంస్థలు కస్టమర్లకు సేవలందిస్తున్నాయి. అయితే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ అలాంటి వారికి శుభవార్తను అందించింది. ఉద్యోగం లేని ఆ నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఒక్కరు తమ సామార్థ్యాలను నిరూపించుకుని జీవితంలో ఆర్థికంగా ఎదగడానికి అమెజాన్ ఇండియా కృషి చేస్తోంది. ఉచితంగా శిక్షణతో పాటు ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రకటనను విడుదల చేసింది. ఆ వివరాలు మీ కోసం..

అమెజాన్ ఇండియా దివ్యాంగులకు గుడ్ న్యూస్ తెలిపింది. వారికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పింది. ట్రైనింగ్‌ ఇచ్చి మరి ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 2026 వరకు ఐదు రాష్ట్ర ప్రభుత్వాలతో ఎంఓయూ అమలులో ఉంటుందని, ఈ ఐదు రాష్ట్రాల్లోని దివ్యాంగులకు నైపుణ్యం, ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ఈ చొరవ తీసుకున్నట్లు అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. అమెజాన్ ఇండియా దివ్యాంగులకు నైపుణ్యం, జీవనోపాధి కల్పించడంపై దృష్టి పెట్టింది. అమెజాన్ ఆపరేషన్స్‌ నెట్‌వర్క్ పరిధిలోని ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లు, సార్టేషన్‌ కేంద్రాలు, డెలివరీ స్టేషన్‌లలో దివ్యాంగులకు స్టోవింగ్‌, పికింగ్‌, ప్యాకింగ్, సార్టింగ్‌ వంటి ఉద్యోగాలను కల్పించనున్నారు.