iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తొలినాళ్లలో తెలంగాణా శాసనమండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్ సన్ టిడిపి అభ్యర్థికి మద్దతుగా ఓటు వేసేందుకు రూ. 50లక్షలు లంచం ఎర చూపారు. ఈ సందర్భంగా నాటి టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎసిబి అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. లంచం ఇస్తున్న సందర్భంగా నాటి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కూడా ఫోన్ లో మాట్లాడించారు. వీటికి సంబంధించిన ఆడియో, వీడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో ఈ సంఘటన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించడంతో పాటు, చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి హడావుడిగా పెట్టేబేడా సర్దుకుని అమరావతికి తరలివచ్చే పరిస్థితులు కల్పించింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసులో ఎ4 నిందితుడుగా ఉన్న జరుసలేం మత్తయ్య చంద్రబాబు పై సంచలన వాఖ్యలు చేశారు. ఈ కేసులో తాను అప్రూవర్ గా మారినందుకు తనని చంపేందుకు కుట్ర జరుగుతుందని, చంద్రబాబు , రేవంత్ రెడ్డి వర్గం నుండి తనకు ప్రాణ హాని ఉందని కావున ఈ కేసు పూర్తి అయ్యే వరకు తనకు రక్షణ కల్పించాలని కోరుతు మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించారు. అప్రూవర్ గా మారిన జరుసలేం మత్తయ్య చేసిన వాఖ్యలు పై తెలుగుదేశం నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.