iDreamPost
android-app
ios-app

ఎమోషనల్ ఫీలింగ్ తో తెలుగు “96 “

  • Published Jan 10, 2020 | 2:23 AM Updated Updated Jan 10, 2020 | 2:23 AM
ఎమోషనల్ ఫీలింగ్ తో  తెలుగు “96 “

తమిళ్ లో సున్నితమైన ప్రేమ కథగా రూపొంది బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన 96 తెలుగు రీమేక్ జాను పేరుతో వస్తున్న సంగతి తెలిసిందే. శర్వానంద్ సమంతా జంటగా ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు ప్రేమ్ కుమార్ తో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకునే స్టేజిలో ఉంది. ఈ రోజు టీజర్ ని రిలీజ్ చేశారు. కథను ఎక్కువ రివీల్ చేయకుండా కేవలం హీరో హీరోయిన్ మధ్య ఎమోషన్స్ ని ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశారు. 

నిజానికి ఇందులో మరీ మలుపులు  ఉండే స్టోరీ ఉండదు. పదో తరగతిలో విడిపోయి ఓ ఇరవై ఏళ్ళ తర్వాత కలుసుకున్న ఓ అమ్మాయి అబ్బాయి ఎలా పరస్పరం స్పందించుకుంటారు అనే పాయింట్ మీద చాలా లైటర్ వీన్ తరహాలో ఇది తెరకెక్కింది, టీజర్ విషయానికి వస్తే శర్వా ట్రావెలర్ గా ప్రయాణాలు చేస్తూ తాను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ కు వెళ్తాడు. ఇతని పేరు రామచంద్ర. ఇష్టపడిన అమ్మాయి జానకి. అందరూ జాను అని పిలుస్తారు. తనే సమంతా. తర్వాత ఇద్దరు కలుసుకుని ఏం చేశారు అనేదే జాను  

శర్వా రెండు గెటప్స్ లో కనిపించాడు. ఒకటి బాగా గుబురు గెడ్డంతో మరొకటి షేవ్ చేసుకున్నది. ఫ్లాష్ బ్యాక్ లో వేరే ఆర్టిస్టులు తీసుకున్నారు. మొత్తానికి ఫీల్ మిస్ కాకుండా ఉండేందుకు యథాతథంగా తీసినట్టు కనిపిస్తోంది. సమంతా పాత్రలో చాలా ఎమోషన్ ఉండటంతో వాటినే టీజర్ లో పొందుపరిచారు. గోవింద్ వసంత్ సంగీతం కూడా ఫీల్ గుడ్ తరహాలో ఉంది. మరి కోలీవుడ్ లో సెన్సషనల్ మూవీగా కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న 96 తెలుగు జానుగా ఎంతమేరకు మెప్పిస్తుందో మెప్పిస్తుందో విడుదలయ్యాక చూడాలి

jojobet girişJojobet GirişEnbet Girişivermectin tabletPusulabetPusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetmarsbahis girişJojobet GirişJojobet GirişcasibomHoliganbetCasibom Giriş