iDreamPost
android-app
ios-app

Jana Gana Mana : ఇన్నేళ్ల తర్వాత ఆ సినిమా తీస్తారా

  • Published Jan 26, 2022 | 5:28 AM Updated Updated Jan 26, 2022 | 5:28 AM
Jana Gana Mana : ఇన్నేళ్ల తర్వాత ఆ సినిమా తీస్తారా

టెంపర్ తర్వాత కొన్నేళ్లు హిట్లు కోల్పోయి ఇస్మార్ట్ శంకర్ తో గట్టిగా బౌన్స్ బ్యాక్ అయిన దర్శకుడు పూరి జగన్నాథ్ రాబోయే లైగర్ తో ఫామ్ ని పూర్తిగా అందిబుచ్చుకుంటాడనే నమ్మకంతో ఉన్నారు. దానికి తగ్గట్టే హైప్ కూడా పెరుగుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండేని హీరోయిన్ గా పరిచయం చేస్తూ రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ కం యాక్షన్ డ్రామా రిలీజ్ కు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్ల కోసం పూరి టీమ్ చాలా ప్లాన్లు వేస్తోంది. గీత గోవిందం తర్వాత ఆ స్థాయి బ్లాక్ బస్టర్ లేక ఇబ్బంది పడుతున్న రౌడీ హీరోకు దీని సక్సెస్ చాలా కీలకం. మైక్ టైసన్ క్యారెక్టర్ కూడా అంచనాలు పెంచుతోంది.

ఇక విషయానికి వస్తే పూరి ఎప్పుడో రాసి పెట్టుకున్న జనగణమన మళ్లీ తెరపైకి వస్తోందని సమాచారం. గతంలో మహేష్ బాబుతో దీన్ని తీయాలని పూరి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఈ కథ చెప్పే టైంలో పూరి సక్సెస్ లో లేకపోవడంతో పాటు ప్రిన్స్ కూడా బిజీగా ఉండటంతో సాధ్యపడలేదు. మరో ఇద్దరి ముగ్గురిని కలిసినా లాభం లేకపోయింది. దేశభక్తి కథాంశంతో ప్లాన్ చేసుకున్న ఈ పీరియాడిక్ డ్రామా మీద పూరికి ఇప్పుడూ నమ్మకం ఉందట. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం దీన్నే బాలీవుడ్ హీరోలతో తీసేలా నిర్మాత కరణ్ జోహార్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. అమితాబ్ బచ్చన్ కి ముందు నెరేట్ చేస్తారట.

ఆయనతో పాటు మరికొందరు హీరోలు ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యేలా చూస్తారట. పూరి గతంలో అమితాబ్ తో బుడ్డా హోగా తేరే బాప్ చేసిన అనుభవం ఉంది. సో ఒప్పించడం కష్టం కాదు. కానీ ఇదంతా నిజమైనా కార్యరూపం దాల్చడానికి చాలా టైం పడుతుంది. లైగర్ అయ్యాక తెలుగులో బాలకృష్ణతో ఓ సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడు పూరి. ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలోనే. ఈ లెక్కలన్నీ లైగర్ ఫలితం వచ్చాక మారొచ్చు. ఒకవేళ అది బ్లాక్ బస్టర్ అయితే కాంబినేషన్లు చేంజ్ అయినా ఆశ్చర్యం లేదు. ఇదే తరహాలో కృష్ణవంశీ కూడా ఒకప్పుడు వందేమాతరం టైటిల్ తో కథను సిద్ధం చేసుకున్నారు కానీ ఫైనల్ గా వదిలేశారు.

Also Read : Samyuktha Menen : భీమ్లా నాయక్ ప్రభావం గట్టిగానే ఉంది