iDreamPost
android-app
ios-app

కరోనా జేమ్స్ బాండ్ ని కూడా వదల్లేదు

కరోనా జేమ్స్ బాండ్ ని కూడా వదల్లేదు

జేమ్స్ బాండ్.. శత్రువుల వెన్నులో వణుకుపుట్టించే పేరు.. ఇప్పుడు ఆ పేరు కూడా ఒక వైరస్ వల్ల భయపడుతుంది. త్వరలో విడుదల కాబోతున్న జేమ్స్ బాండ్ కొత్త చిత్రం “నో టైమ్ టు డై” కరోనా వైరస్ వల్ల ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు నెలలు వెనక్కి వెళ్ళింది.

జేమ్స్ బాండ్ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాయి. జేమ్స్ బాండ్ కొత్త చిత్రం వస్తుందంటే సినీ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. తాజాగా జేమ్స్ బాండ్ సిరీస్ లో 25 వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జేమ్స్ బాండ్ కొత్త చిత్రం “నో టైమ్ టు డై”. డేనియల్ క్రెగ్ జేమ్స్ బాండ్ పాత్రలో నటిస్తున్న చివరి చిత్రం కూడా ఇదే.. భారీ వ్యయంతో అద్భుతమైన గ్రాఫిక్స్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

కాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ రెండో తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు రంగం సిద్ధం చేసారు. అందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కాగా కరోనా ప్రభావం కాస్త “నో టైమ్ టు డై” చిత్ర కలెక్షన్లపై పడుతుందని చిత్ర నిర్మాతలు భావించడంతో ఏకంగా ఏడు నెలలు వెనక్కి తగ్గి నవంబర్ 25న విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు.

ఇప్పటికే దాదాపు 80 దేశాలకు వ్యాపించిన కరోనా ప్రభావంతో దాదాపు 3000 మందికి పైగా మృతిచెందారు. 91000 పైగానే ఈ వైరస్ బారిన పడ్డారు. కరోనా వైరస్ విరుగుడు మందు తయారీకి కొన్ని నెలల వరకు ఆగాల్సిందేనని పరిశోధకులు చెబుతున్నారు.