Dharani
Dharani
ఏడు పదుల వయసులో కూడా వరుస సినిమాలు చేయడమే కాక.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తూ.. తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నారు సూసర్ స్టార్ రజనీకాంత్. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కిన జైలర్ సినిమా తమిళ నాట మాత్రమే కాక.. ఇటు టాలీవుడ్‌లోనూ భారీ వసూళ్లు సాధిస్తోంది. బాక్సాఫీస్ వద్ద జైలర్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు. ఇక తెలుగులో జైలర్ సినిమాను ఏషియన్ సినిమాస్ విడుదల చేసిన సంగతి తెలసిందే. అయితే విడుదల సమయంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఏషియన్‌తో కలిశారు. జైలర్ నైజాం ఏరియా హక్కులను దిల్ రాజు కొనుగోలు చేశారు. జైలర్ నైజాం హక్కులు కొనుగోలు చేసి.. దిల్ రాజు కోట్ల రూపాయల లాభాలు ఆర్జించాడని ఫిల్మ్ నగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఈనెల 10న విడుదలైన ‘జైలర్’.. నైజాంలో తొలిరోజు రూ.3.21 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. నిజానికి దిల్ రాజు.. జైలర్ సినిమా నైజాం హక్కులను సుమారు రూ.4.50 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. అంటే.. తొలి రోజే జైలర్.. నైజాంలో దాదాపుగా 80 శాతం మేర వసూలు చేశాడు. ఇక తొలిరోజు వచ్చిన హిట్ టాక్‌తో రెండో రోజు నుంచీ నేటి వరకు బాక్సాఫీస్ వద్ద జైలర్ దండయాత్ర కొనసాగుతూనే ఉంది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా నైజాంలో రూ.30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక షేర్ విషయానికి వస్తే.. 10 రోజుల్లో నైజాం ఏరియాలో రూ.17.50 కోట్లుగా ఉందట. అంటే, దిల్ రాజుకు సుమారు రూ.13 కోట్ల మేర లాభం అంటూ ఫిల్మ్ నగర్‌లో ప్రచారం సాగుతోంది.
మొత్తం షేర్ – రూ. 17.57 కోట్లు
మొత్తం షేర్ – రూ. 37.09 కోట్లు
పైన ఇచ్చిన కలెక్షన్ వివరాలు కేవలం సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేసినవి మాత్రమే.