iDreamPost
android-app
ios-app

Jai Bhim : అరుదైన ఘనత దక్కించుకున్న జైభీమ్

  • Published Nov 13, 2021 | 9:41 AM Updated Updated Nov 13, 2021 | 9:41 AM
Jai Bhim : అరుదైన ఘనత దక్కించుకున్న జైభీమ్

ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన జైభీమ్ కు సర్వత్రా ఎన్ని ప్రశంసలు దక్కుతున్నాయో చూస్తున్నాం. ఓటిటిలో రావడం వల్ల ఎక్కువ శాతం చూసే అవకాశం దక్కడంతో పాటు అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయడంతో రీచ్ భారీగా ఉంది. తాజాగా మరో ఘనతను జైభీమ్ అందుకుంది. సినిమా రేటింగ్స్ కి ప్రామాణికంగా నిలిచే ఐఎండిబిలో 9.6 తో అగ్ర స్థానంలో నిలిచింది. ఇప్పటిదాకా టాప్ లో ఉన్న ఆల్ టైం క్లాసిక్ ది శశాంక్ రిడమ్ ప్షన్ ని దాటేసి మరీ ఈ క్రెడిట్ అందుకుంది. దానికి 9.3 ఉండగా నెక్స్ట్ ప్లేస్ లో 9.2 తో ఎవర్ గ్రీన్ గ్యాంగ్ స్టర్ డ్రామా గాడ్ ఫాదర్ ఉంది. టాప్ 250లో ఒక భారతీయ సినిమాకు ఇంత అపూర్వ స్పందన దక్కడం విశేషం.

ఇది శాశ్వతంగా ఉండకపోయినా ప్రస్తుతానికి మాత్రం వరల్డ్ సినిమాతో పోటీ పడుతూ ఈ ర్యాంక్ చేజిక్కించుకోవడం చిన్న విషయం కాదు. ఎందుకంటే ఐఎండిబిలో ప్రపంచవ్యాప్తంగా యూజర్స్ ఉంటారు. వాళ్ళు ఇచ్చే రేటింగ్ ని బట్టే ఇవి మారుతూ ఉంటాయి. కానీ జైభీమ్ అమెరికన్, కొరియన్, జపనీస్, ఫిలిప్పైన్స్ లాంటి ఇంటర్ నేషనల్ కంటెంట్ తో పోటీ పడుతూ గెలిచింది. అందుకే ఇప్పుడిది సోషల్ మీడియాలోనూ స్పెషల్ టాపిక్ గా నిలిచింది. జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య స్వయంగా నిర్మించిన జైభీమ్ థియేటర్ల రావడం కన్నా ఎక్కువ ప్రయోజనాన్ని దక్కించుకుంది. మూడు వందల దేశాల్లో ఆడియన్స్ దీన్ని చూసే అవకాశం దొరికింది.

కమర్షియల్ సూత్రాలకు భిన్నంగా సూర్య చేసిన ఈ సాహసం మీద ఇప్పటికే పలు బాషల పరిశ్రమల్లో చర్చలు జరుగుతున్నాయి. తెలుగులోనూ ఇలాంటివి చేయొచ్చు కదానే రీతిలో మూవీ లవర్స్ మన హీరోలను డిమాండ్ చేస్తున్నారు. వెనుకబడిన వర్గాలకు జరుగుతున్న అన్యాయం దగా మీద హత్తుకునే రీతిలో జైభీమ్ ని రూపొందించిన తీరు మరికొందరికి స్ఫూర్తిస్తున్న మాట వాస్తవం. గత ఏడాది ఆకాశం నీ హద్దురాతో ఇదే తరహా ఫలితాన్ని అందుకున్న సూర్య నెక్స్ట్ రెండు సినిమాలు మాత్రం థియేటర్లలోనే రాబోతున్నాయి. ఒకటి షూటింగ్ పూర్తి చేసుకోగా మరొకటి ఫినిషింగ్ కి దగ్గరలో ఉంది

Also Read : Bhagyasree : కూతుర్ని పరిచయం చేయనున్న ప్రేమపావురాలు హీరోయిన్