Idream media
Idream media
రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల విద్యార్థుల ఉన్నత చదువులకు అండగా నిలిచేందుకు ఉద్ధేశించిన జగనన్న వసతి దీవెన పథకాన్ని ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయనగరంలో ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 11,87,904 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి జరగనుంది. డిగ్రీ, ఆపై చదువులు చదివే వారికి ఏడాదికి 20 వేల రూపాయలు రెండు విడతల్లో ప్రభుత్వం చెల్లించనుంది. ఫిబ్రవరిలో రూ. 10వేలు, జూలై నెలలో రూ. 10వేలను విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాలో జమచేయనున్నారు. ఐటీఐ చదువుతున్న వారికి రెండు విడతల్లో 10వేల రూపాయలను, పాలిటెక్నిక్ చదివే వారికి రెండు విడతల్లో రూ. 7,500 చెల్లిస్తారు.
విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే అమ్మ ఒడి లాంటి గొప్ప పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకాన్ని ఎంతో మంది ప్రముఖులు సైతం ప్రశంసించారు. పిల్లను బడికి పంపే ప్రతి తల్లికి ఏటా 15వేలు ఇచ్చేందుకు ఉద్ధేశించిన అమ్మ ఒడి పథకాన్ని జనవరి 9 సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా దాదాపు 43 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరింది. దాదాపు రూ. 6,456 కోట్లను ఈ పథకం కోసం కేటాయించారు.
అలాగే నాడు–నేడు ద్వారా పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు నడుం బిగించింది. పాఠశాలల్లో స్వచ్ఛమైన తాగునీరు, శుభ్రమైన మరుగుదొడ్లు, విశాలమైన క్లాస్రూంలు, కంప్యూటర్ ల్యాబ్‌లు లాంటి సౌకర్యాలను కల్పించనుంది. అలాగే విద్యా సంవత్సరం ప్రారంభం కాకమునుపే విద్యార్థులకు యూనిఫాం, టెక్స్›్ట బుక్స్, నోట్ బుక్స్‌తో కూడిన కిట్‌ను అందించనుంది. విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను కూడా ఈ ఏడాది నుంచి అమలు చేయనున్న విషయం తెలిసిందే. అదే సమయంలో తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా నిర్ణయించారు.