iDreamPost
android-app
ios-app

ముఖ్యమంత్రి కోర్టుకి హాజరు కావాల్సిందే..

ముఖ్యమంత్రి కోర్టుకి హాజరు కావాల్సిందే..

అక్రమ ఆస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్ ఈనెల 10 న జరగనున్నతదుపరి వాయిదా కి హాజారు కావాల్సిందేనని సిబిఐ కోర్ట్ స్పష్టం చేసింది. వచ్చే శుక్రవారం నుంచి వైఎస్ జగన్, విజయ సాయి రెడ్డి ఇద్దరు కోర్టుకి హాజరు కావాల్సిందేనని జగన్ న్యాయవాదులకు కోర్ట్ తెలియజేసింది. సిబిఐ జగన్ పై వేసిన చార్జిషీట్లకు సంభందించి విచారణ జరుగుతున్నతరుణంలో జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకి హాజారు కావాల్సి వుంది. గతంలో ప్రతిపక్షనేత గా ఉన్నప్పుడు తాను పాదయాత్ర చేస్తున్న సందర్భంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ జగన్ పెట్టుకున్న అభ్యర్ధనని హైకోర్టు, సుప్రీం కోర్టులు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.

అయితే 2019 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నేపథ్యంలో తనకు వ్యక్తిగత హాజరునుండి మినహాయింపు ఇవ్వాలనే జగన్ అభ్యర్ధనని కోర్ట్ తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో గత 8 వారాలుగా జగన్ కోర్ట్ కి హాజరు కాకపోవడం, ప్రతి వాయిదా కి జగన్ తరుపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేస్తున్న తరుణంలో తదుపరి వాయిదాకు హాజరు కావాల్సిందేనని ఈ రోజు కోర్ట్ ఆదేశించింది.

కోర్ట్ ఆదేశాలపై జగన్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. ఆయన సిబిఐ కోర్ట్ ఇచ్చిన ఆదేశాలని సస్పెండ్ చేసి తనకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారా లేదా వాయిదాకు హాజరవుతారా వేచి చూడాలి.