iDreamPost
android-app
ios-app

తల్లి సర్జరీకి డబ్బుల్లేక.. ఇల్లు అమ్మేసిన జబర్దస్త్ శాంతి స్వరూప్!

  • Published Aug 25, 2023 | 5:17 PM Updated Updated Aug 25, 2023 | 5:17 PM
  • Published Aug 25, 2023 | 5:17 PMUpdated Aug 25, 2023 | 5:17 PM
తల్లి సర్జరీకి డబ్బుల్లేక.. ఇల్లు అమ్మేసిన జబర్దస్త్ శాంతి స్వరూప్!

జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్స్ వేసే ఆర్టిస్టులకు బయట ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే లేడీ గెటప్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేర్లు వినోదిని, జబర్దస్త్ శాంతి. ప్రస్తుతం వినోదిని షో మానేసిన సంగతి తెలిసిందే. అయితే శాంతి స్వరూప్ మాత్రం ఇంకా షోలో కొనసాగుతూనే ఉన్నాడు. ఒక్క జబర్దస్త్ లోనే కాకుండా టీవీ షోస్, స్పెషల్ ఈవెంట్స్ చేస్తుంటారు. అయితే వీళ్లు రెండు చేతుల సంపాదిస్తారని.. లక్షలు కూడబెడుతుంటారని చాలానే పుకర్లు వస్తుంటాయి. అయితే అందరి పరిస్థితి అది కాదు. చేతిలో డబ్బుల్లేక జబర్దస్త్ శాంతి స్వరూప్ ఇల్లు అమ్మేసుకున్నాడు.

యూట్యూబ్ లో జబర్దస్త్ శాంతికి ఖరీదైన ఇల్లు, లగ్జరీ కారు అంటూ చాలానే వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. అయితే అవన్నీ వ్యూస్ కోసం చేసుకున్న వీడియోలు మాత్రమే. రియాలిటీలో శాంతి స్వరూప్ కు అలాంటివి ఏమీ లేవు. నిజానికి ఇప్పుడు తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని.. ఉన్న ఒక్కగానొక్క ఆస్తి అయిన సొంతింటిని అమ్మేసినట్లు తెలియజేశాడు. షైనింగ్ శాంతి అంటూ శాంతి స్వరూప్ కు యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో వీడియో అప్ లోడ్ చేసి అసలు విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. తల్లికి మోకాలు ఆపరేషన్ చేయించాల్సి ఉందని చెప్పాడు. అందుకు అతని వద్ద డబ్బుల్లేక సొంతింటిని అమ్మేశానని చెప్పాడు.

ఇల్లు అమ్మిన విషయం తన తల్లికి కూడా తెలియదని చెప్పుకొచ్చాడు. ఇన్నాళ్లు నాకోసం ఉన్న ఇల్లు ఇప్పుడు నాకు లేకుండా పోయింది అంటూ శాంతి స్వరూప్ ఎమోషనల్ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. అయితే మరోవైపు శాంతి స్వరూప్ ను మెచ్చుకుంటున్నారు. చాలామంది సహాయం చేయండి అంటూ కోరుకుంటారు. మీరు మాత్రం ఉన్న ఇంటిని అమ్మేసి తల్లికి సర్జరీ చేయించాలని చూస్తున్నారు. మీరు చాలా గ్రేట్ అంటూ శాంతి స్వరూప్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా జీవితంలో ధైర్యంగా ముందుకు సాగాలి అంటూ దైర్యం చెబుతున్నారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio