iDreamPost
android-app
ios-app

ఆపద్బాంధవుడు పన్నులు ఎగ్గొట్టాడా

  • Published Sep 18, 2021 | 11:08 AM Updated Updated Sep 18, 2021 | 11:08 AM
ఆపద్బాంధవుడు పన్నులు ఎగ్గొట్టాడా

ఎలా ఏ మార్గంలో సహాయం చేసినా గత ఏడాదికి పైగా ముఖ్యంగా కరోనా సమయంలో నటుడు సోనూ సూద్ అందించిన సేవలు చాలా గొప్పవి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దేశంలో ఎక్కడ ఎలాంటి విపత్తు వచ్చినా ఎవరు సోషల్ మీడియా హెల్ప్ మీ అని వేడుకున్నా తన దృష్టికి రావడం ఆలస్యం వెంటనే స్పందించి వాళ్ళను ఆదుకోవడం చూసి మెచ్చుకోని భారతీయులు లేరంటే అతిశయోక్తి కాదు. అలాంటి సోనూ సూద్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. గత మూడు రోజులుగా అతని కార్యాలయాల మీద దాడులు చేస్తున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోను సూద్ 20 కోట్ల రూపాయల దాకా పన్ను ఎగ్గొట్టారని ప్రకటించి సంచలనం రేపారు.

దీనికి సంబంధించిన కొన్ని కీలక ఆధారాలు వాళ్లకు లభించినట్టు చెబుతున్నారు. అకౌంట్ లో చూపించని మొత్తాన్ని వివిధ మార్గాల్లో బోగస్ సంస్థల ద్వారా లావాదేవీలు జరిపి సోనూ సూద్ టాక్స్ కట్టకుండా తప్పించుకున్నారని పేర్కొంటున్నారు. దీనికి సహకరించిన 20 ఎంట్రీలు తమ తప్పును ఒప్పుకున్నట్టుగా కూడా చెబుతున్నారు. కొన్ని రసీదులు లోన్లుగా మార్చుకుని పన్ను నుంచి మినాయింపు పొందేందుకు ప్రణాళిక వేసుకున్నారని వాళ్ళ అభియోగం. ఇదంతా ఇరవై కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. కరోనా ఫస్ట్ వేవ్ లో వచ్చిన 18 కోట్లు లాభదాయక ఉద్దేశాలు లేని ఓ సంస్థ అకౌంట్ లో ఇంకా అలాగే ఉంచారట.

సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా జరిపిన సోదాల్లో అధికారులకు ఇంకా చాలా వాస్తవాలు బయట పడ్డాయని తెలిసింది. బోగస్ కాంట్రాక్టుల ద్వారా 65 కోట్ల దాకా ట్రాన్సాక్షన్స్ కనుగొన్నారు. సుమారు 1 కోటి 80 లక్షల దాకా క్యాష్ కూడా దొరికిందని వార్త. మొత్తానికి సోనూ సూద్ వ్యవహారం ఇప్పుడు జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చాలా సుదీర్ఘమైన స్టేట్ మెంట్ లో ఐటి డిపార్ట్ మెంట్ ఇదంతా వివరించింది. ఆప్ పార్టీ శివసేనలు సోనుకి మద్దతుగా నిలుస్తున్నాయి. ఇప్పుడీ వ్యవహారం చాలా మలుపులు తిరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సహాయం చేయడం ఏమో కానీ ఇప్పుడీ వివాదం గురించి సోనూ సూద్ ఏమంటాడో

Also Read : పాత సినిమాలకు కొత్త రోజులొచ్చాయి