iDreamPost
android-app
ios-app

83 Movie : ఇలాంటి బయోపిక్కులు ఆపేస్తే మంచిదేమో

  • Published Jan 06, 2022 | 9:12 AM Updated Updated Jan 06, 2022 | 9:12 AM
83 Movie : ఇలాంటి బయోపిక్కులు ఆపేస్తే మంచిదేమో

రాను రాను సిల్వర్ స్క్రీన్ మీద క్రికెట్ ని ఒక ఎమోషన్ గా ఫీలవ్వడం ప్రేక్షకుల్లో తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ 83. ఏడాదికి పైగా విడుదలను వాయిదా వేసుకుంటూ వచ్చి త్రిడి ఎఫెక్ట్ లో ఇండియా మొదటి వరల్డ్ కప్ విక్టరీని చూపించాలనుకున్న రిలయన్స్ ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. కరోనా ఆంక్షలు మొదలవ్వడం వల్ల వసూళ్లు మందగించినప్పటికీ దానికి ముందే ఆశించిన స్థాయిలో బుకింగ్ ట్రెండ్స్ లేకపోవడం మీడియాని సైతం ఆశ్చర్యపరిచింది. దర్శకుడు కబీర్ ఖాన్ అప్పటి భావోద్వేగాలను అద్భుతంగా చిత్రీకరించినప్పటికీ అవి అంతగా కనెక్ట్ కాలేకపోవడానికి కారణాలు ఉన్నాయి.

వాస్తవంగా చెప్పాలంటే ఒకప్పటి క్రికెట్ పిచ్చి జనంలో ఇప్పుడు తగ్గింది. ఓ పది ఇరవై ఏళ్ళ కిందట టెస్టు మ్యాచు జరుగుతున్నా సరే అభిమానులు ఎప్పటికప్పుడు స్కోర్లు తెలుసుకునే విషయంలో అప్ డేట్ గా ఉండేవాళ్ళు. టి కొట్టు దగ్గరో క్యాంటీన్ దగ్గరో కలిసి మాట్లాడుకుంటే అందులో ఆ రోజు తాలూకు మ్యాచ్ కబుర్లు ఖచ్చితంగా ఉండేవి. కానీ ఇప్పుడలా కాదు. పేపర్ లోనో న్యూస్ ఛానల్ లోనో చూసి అవునా అనుకుంటున్నారు. గత ఏడాది పాకిస్థాన్ చేతిలో ఇండియా ఓడిపోయినప్పుడు మనవాళ్ళు కొన్ని నిముషాలు అయ్యో అనేసుకుని ఆ తర్వాత మరిచిపోయారు. అదే పాతికేళ్ల క్రితం అయితే గొడవలు కూడా అయ్యేవి.

ఇప్పుడు టీమ్ ఇండియా పెర్ఫార్మన్స్ ఎంత బాగున్నప్పటికీ మునుపటి ఉద్వేగం ఇప్పుడీ క్రీడలో లేదనే నిజాన్ని ఒప్పుకోవాలి. పైగా ఈ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న బయోపిక్స్ కూడా మెల్లగా బోర్ కొట్టేస్తున్నాయి. సచిన్, అజహర్, ధోని, కపిల్ దేవ్, మిథాలీ రాజ్ ఇలా చాలానే వచ్చాయి. త్వరలో అనుష్క శర్మ నటించిన చక్దా ఎక్స్ ప్రెస్ థియేటర్లు వద్దనుకుని నేరుగా నెట్ ఫ్లిక్స్ లోనే వస్తోంది. పైన చెప్పిన కారణాలే దానికి దోహదం చేశాయి. ఏదైనా మితంగా జరిగితేనే బాగుంటుంది. క్రికెట్ క్రేజ్ ఉంది కదాని వరసపెట్టి బయోపిక్కులు తీసుకుంటూ పోతే ఒక స్టేజికి వచ్చాక ఇలాగే ఇక చాలు అనిపిస్తుంది. అందుకే 83 ఫలితం తిరగబడింది

Also Read : Srikanth Bolla : బాలీవుడ్ లో తెలుగు పారిశ్రామికవేత్త బయోపిక్.. చాలా స్పెషల్.. ఎందుకంటే?