Idream media
Idream media
టి 20 ప్రపంచ కప్ లో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ… కెప్టెన్సీ విషయంలో చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. మొదటి మ్యాచ్ విషయంలో కోహ్లీ చేసిన తప్పులు అన్నీ ఇన్నీ కాదు. పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే పక్కా ప్రణాళిక తో దిగాల్సిన కోహ్లీ ఎన్నో తప్పులతో ఘోర ఓటమితో ఫాన్స్ ని ఇబ్బంది పెట్టాడు. ఇక రెండో మ్యాచ్ న్యూజిలాండ్ తో కావడం తో ఏం జరుగుతుంది ఏంటీ అనే దానిపై అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీ సాహసం చేసాడు.
దాదాపుగా వైట్ బాల్ క్రికెట్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఏడేళ్ళ నుంచి కూడా ఓపెనర్ గానే వస్తున్నాడు. కాని ఈ మ్యాచ్ లో అతన్ని మూడో స్థానంలో పంపాలని నిర్ణయం తీసుకున్నాడు. మొదటి మ్యాచ్ టీం నే దాదాపుగా కొనసాగించిన కోహ్లీ… సూర్యకుమార్ యాదవ్ ని పక్కన పెట్టి టీంలోకి ఇషాన్ కిషన్ ని తీసుకున్నాడు. ఈ ఏడాది ఐపిఎల్ లో సత్తా చాటిన కిషన్ పై చాలా నమ్మకం ఉంచాడు. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం కెఎల్ రాహుల్ ని అలాగే ఇషాన్ కిషన్ ను ఓపెనింగ్ కి పంపించాడు.
వార్మప్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై 70 పరగులు చేసి సత్తా చాటాడు. ఆ మ్యాచ్ లో ఇషాన్ భారీ సిక్సులతో విరుచుకుపడ్డాడు. అందుకే ఈ మ్యాచ్ లో అతనికి అవకాశం ఇవ్వగా… ఇషాన్ కిషన్ తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. 8 బంతులు ఆడి కేవలం నాలుగు పరుగులు చేసాడు. ఇక పవర్ ప్లే లో టీం ఇండియా పెద్దగా ఆకట్టుకోలేదు. మూడో స్థానంలో వచ్చే రోహిత్ పైనే టీం ఆశలు అన్నీ ఉన్నా సరే రోహిత్ శర్మ మొదటి బంతి నుంచి ఇబ్బందిగానే ఆడాడు. ఇక 8 వ ఓవర్ లో సోది బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. 14 బంతుల్లో 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మొదటి మ్యాచ్ లో ఘోరంగా ఫెయిల్ అయిన హార్దిక్ పాండ్యాను ఈ మ్యాచ్ లో కొనసాగించాడు. మరి అతను బౌలింగ్ చేస్తాడా లేదా అనేది చూడాలి.