iDreamPost
android-app
ios-app

మళ్ళీ సింగ్ టైటిల్ తో పవన్ ?

  • Published Sep 06, 2021 | 6:20 AM Updated Updated Sep 06, 2021 | 6:20 AM
మళ్ళీ సింగ్ టైటిల్ తో పవన్ ?

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ షూటింగ్ ఒకపక్క జరుగుతుండగానే దాని మీద కంటే ఎక్కువ గురి అభిమానులకు దర్శకుడు హరీష్ శంకర్ తీయబోయే సినిమా మీద ఉంది. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ని తమ హీరోకు ఇచ్చిన డైరెక్టర్ గా అతని మీద గట్టి నమ్మకమే పెట్టుకున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లేలా ప్లానింగ్ జరుగుతోంది. భీమ్లా నాయక్ కు గుమ్మడికాయ కొట్టగానే హరిహరవీర మల్లుతో పాటు దీంట్లోనూ పాల్గొంటారట. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం దీనికి ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే పేరుని ఫిక్స్ చేయబోతున్నట్టుగా వచ్చిన లీక్ ఫిలిం నగర్ వర్గాలతో పాటు మీడియా సర్కిల్స్ లోనూ చక్కర్లు కొడుతోంది. అధికారిక ప్రకటన రాలేదు.

Also Read: ఆడియన్స్ చేతలకు అర్థాలే వేరులే

ఇప్పటి దాకా దీనికి సంబంధించి వచ్చిన పోస్టర్లు ప్రీ లుక్స్ చూస్తే ఇది నిజమైనా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈసారి ఎంటర్ టైన్మెంట్ ఒకటే ఉండదని దాంతో పాటు బలమైన సోషల్ మెసేజ్ ఉంటుందని హరీష్ శంకర్ అప్పుడప్పుడు క్లూస్ ఇస్తూనే ఉన్నాడు. ఆ లెక్కన చూస్తే భగత్ సింగ్ టైటిల్ లోనే పవర్ ఫుల్ వైబ్రేషన్స్ ఉన్నాయి. సో ఇది లాక్ అయ్యే ఛాన్స్ ని కొట్టిపారేయలేం. అయితే భవదీయుడుని ఉంచుతారా లేక భగత్ సింగ్ ని సోలోగా డిసైడ్ చేస్తారా తెలియాల్సి ఉంది. అఫీషియల్ గా వచ్చే వరకు దీన్ని గాసిప్ గానే పరిగణించాలి. కానీ ఫ్యాన్స్ మాత్రం అప్పుడే భలే పేరు సెట్ అయ్యిందని సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

2022 సంక్రాంతికి ఆల్రెడీ రిలీజ్ లాక్ చేసుకున్న భీమ్లా నాయక్ తర్వాత ఏప్రిల్ 24 హరిహరవీరమల్లు వచ్చేస్తుంది. హరీష్ శంకర్ మూవీ ఎంత వేగంగా చేసినా కూడా విడుదల మాత్రం 2023లో ఉండే అవకాశాలు ఎక్కువ. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సోషల్ ఎంటర్ టైనర్ కి ఇంకా హీరోయిన్ ని తీసుకోలేదు. ఏవేవో పేర్లు వినిపిస్తున్నాయి కానీ హరీష్ మనసులో ఎవరు ఉన్నారనేది మాత్రం లీక్ కావడం లేదు. భగత్ సింగ్ టైటిల్ తో తెలుగులో సినిమా కానీ ఆయన గాథ కానీ రాలేదు. మరి పవన్ నిజంగా ఇది చేస్తుంటే మాత్రం ఎంత డిఫరెంట్ గా కనిపిస్తాడో వేచి చూడాలి. ట్విట్టర్ లో యాక్టివ్ గా హరీష్ శంకర్ దీని గురించి ఏదో ఒకటి చెప్పే ఛాన్స్ లేకపోలేదు

Also Read: బాంబు పేల్చిన బండ్ల గణేష్ – సినిమాను మించిన ట్విస్టు