iDreamPost
android-app
ios-app

Kuppam-Chandrababu-చంద్రబాబులో ఉన్నది బాధా? భయమా…? ఏం మాట్లాడుతున్నారు సార్…?

Kuppam-Chandrababu-చంద్రబాబులో ఉన్నది బాధా? భయమా…? ఏం మాట్లాడుతున్నారు సార్…?

కుప్పం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ నాయకులను కూడా విస్మయానికి గురి చేస్తున్నాయి. 7 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మున్సిపాలిటీ కోసం పడుతున్న కష్టాలు అదేవిధంగా చేస్తున్న వ్యాఖ్యలు చాలా మంది కార్యకర్తలను కూడా ఆశ్చర్య పరుస్తున్నాయి. ఏడు సార్లు చంద్రబాబు నాయుడు అక్కడ విజయం సాధించగా దాదాపు నాలుగైదు సార్లు అక్కడ కనీసం నామినేషన్ కూడా వేసేవారు కాదు. కుప్పం నియోజకవర్గంలోని తన సన్నిహిత నేతలే ఈ వ్యవహారాలను చూసుకునే వారు.

చంద్రబాబు నాయుడు సన్నిహిత నాయకులు అక్కడి వ్యవహారాలను చక్కబెట్టే వారు. అయితే ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పట్టు కోల్పోయినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర స్థాయి నాయకులను కుప్పం నియోజకవర్గం పంపించి ప్రచారం చేయించడం, అలాగే తాను ప్రచారం చేయడం, అదే విధంగా తన కుమారుడు నారా లోకేష్ తో ప్రచారం చేయించడం వంటి అంశాలు బాగా హైలైట్ అయ్యాయి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ కూడా కుప్పం నియోజకవర్గంలో భారీగా తగ్గడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కొంతమంది కీలక నాయకులు పార్టీ మారి పోవడం వంటివి ఆశ్చర్యపరిచాయి.

ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నియోజకవర్గం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి కష్టపడుతున్నారు. ఇన్ని రోజులు అక్కడ పని చేయడానికి ముందుకు రాని వైసీపీ నాయకులకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందించడం, కుప్పం నియోజకవర్గ పరిధిలో ఉన్న పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు అని భావించిన కొన్ని ప్రాంతాల్లో కూడా వైసిపి అభ్యర్థులను సమర్థవంతంగా నిలబెట్టడం వంటివి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేయగలిగారు. దీనితో పంచాయతీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గంలో ఇబ్బంది పడింది.

ఇక కుప్పం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఎన్నడూ లేనివిధంగా కష్టపడటం, అదేవిధంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం వంటివి అలాగే మాజీ మంత్రి అమరనాథ రెడ్డి కి ఎక్కువ గా బాధ్యతలు అప్పగించడం చాలా మందిని విస్మయానికి గురిచేసింది. ఇక ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి కూడా దొంగ ఓట్ల కు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు జాగ్రత్తగా ఉండాలని, పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు కూడా చాలామందిని ఆశ్చర్యపరిచాయి.

Also Read : YCP, Sajjala Ramakrishna Reddy, Chandrababu – బాబులో ఫ్రస్ట్రేషన్‌ అందుకేనట.. కారణం చెప్పిన సజ్జల

సోమవారం ఉదయం నుంచి కూడా చంద్రబాబు నాయుడు, అలాగే టిడిపి కి అనుకూలంగా ఉండే కొన్ని మీడియా సంస్థలు కుప్పం నియోజకవర్గంలో దొంగ ఓట్ల కు సంబంధించి ఎక్కువగా హడావుడి చేయడం ఆశ్చర్యపరిచింది. కుప్పం నియోజకవర్గంలో అరాచకాలు జరుగుతున్నాయంటూ టిడిపి నాయకులు వెళ్లి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటం గమనార్హం. ఇక మీడియా సమావేశం ఏర్పాటు చేసి… దొంగ ఓట్లు వేయడానికి యువతను తీసుకువచ్చారని, వాళ్లకు కనీసం ఓటు హక్కు కూడా లేదని చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అలాగే పోలీసు వ్యవస్థను ఎన్నికల సంఘాన్ని టార్గెట్ గా చేసుకుని ఆరోపణలు గుప్పించారు.

అయితే చంద్రబాబు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం వెనుక ప్రధాన కారణం వేరే ఉంది అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో టిడిపి కచ్చితంగా ఓడిపోయే అవకాశాలు కనబడుతున్నాయి అని, అందుకే ఓటమి కారణాన్ని దొంగ ఓట్ల మీదకు మళ్ళించే విధంగా టిడిపి ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. మాజీ మంత్రి అమర్నాథరెడ్డి పోలింగ్ పూర్తయిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి దొంగ ఓట్లను సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగ ఓట్లను భారీగా వేయించడమే కాకుండా బ్యాలెట్ బాక్సులను కూడా తప్పిస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురి చేశాయి.

దీన్ని బట్టి చూస్తే ఓటమి కారణాన్ని దొంగఓట్లపై నెట్టే ప్రయత్నం టిడిపి చేస్తోందనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. 2019 ఎన్నికల్లో ఓటమి కారణాన్ని ఈ.వి.ఎమ్ లపై పెట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు… తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన మెజారిటీ అలాగే బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన మెజారిటీని ఇప్పుడు మున్సిపాలిటీలో వైసిపి నమోదు చేయబోయే విజయాన్ని కూడా దొంగ ఓట్లపై మళ్లించే ప్రయత్నం చేయడం మాత్రం చాలా మందిని షాక్ కి గురి చేస్తోన్న అంశం. సొంత నియోజకవర్గంలో పార్టీ ఓడిపోతున్న తరుణంలో ఇటువంటి వ్యాఖ్యలకు టీడీపీ అధినేత దిగడం పట్ల ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబులో బాధ భయం రెండూ ఉన్నాయని, సొంత నియోజకవర్గం పై పట్టు కోల్పోయానని బాధ ఉందని కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడిపోతే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది పడతాను అనే భయం కూడా చంద్రబాబుులో ఉందని అంటున్నారు.

Also Read : TDP Chandrababu, Kuppam Elections – కుప్పంలో టీడీపీ ఓడిపోతోందా..? చంద్రబాబు ఎందుకలా మాట్లాడారు..?