iDreamPost
android-app
ios-app

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 లాంటి బ్లాక్‌బస్టర్స్‌ను హిందీలో ఎందుకు రావ‌ట్లేదు? అమీర్ ఖాన్ కారణమా? కాఫీ విత్ కరణ్ 7లో కరణ్ జోహార్ ఏమ‌న్నాడంటే?

  • Published Aug 04, 2022 | 5:05 PM Updated Updated Dec 27, 2023 | 6:06 PM

రెండువేల కోట్ల‌ను టార్గెట్ చేశాడ‌ని, హిట్ కొడితే క‌నీసం వెయ్యుకోట్లు గ్యారంటీ అని బాలీవుడ్ సినిమా స‌ర్కిల్స్ న‌మ్మ‌కం పెట్టుకున్నాయి. హిందీ మార్కెట్ లో ఎక్కువ మొత్తాన్ని క‌లెక్ట్ చేసిన సినిమాగా దంగ‌ల్ కున్న రికార్డును కేజీఎఫ్ తుడిచిపెట్టేసింది.

రెండువేల కోట్ల‌ను టార్గెట్ చేశాడ‌ని, హిట్ కొడితే క‌నీసం వెయ్యుకోట్లు గ్యారంటీ అని బాలీవుడ్ సినిమా స‌ర్కిల్స్ న‌మ్మ‌కం పెట్టుకున్నాయి. హిందీ మార్కెట్ లో ఎక్కువ మొత్తాన్ని క‌లెక్ట్ చేసిన సినిమాగా దంగ‌ల్ కున్న రికార్డును కేజీఎఫ్ తుడిచిపెట్టేసింది.

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 లాంటి బ్లాక్‌బస్టర్స్‌ను హిందీలో ఎందుకు రావ‌ట్లేదు? అమీర్ ఖాన్ కారణమా? కాఫీ విత్ కరణ్ 7లో కరణ్ జోహార్ ఏమ‌న్నాడంటే?

LalSinghChaddha హీరో, హీరోయిన్లు అమీర్ ఖాన్ , కరీనా కపూర్ ఖాన్ లు కాఫీ విత్ కరణ్ 7((koffee with karan season 7))కి వ‌చ్చారు. షోలో, కరణ్ జోహార్ , బాలీవుడ్ కంటే బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు తీస్తున్న సౌత్ ఇండియ‌న్ సినిమాల‌ గురించి మాట్లాడారు.

అమీర్ ఖాన్ తన లాల్ సింగ్ చద్దా ప్రమోషన్‌లో య‌మ బిజీ బిజీ. రెండువేల కోట్ల‌ను టార్గెట్ చేశాడ‌ని, హిట్ కొడితే క‌నీసం వెయ్యుకోట్లు గ్యారంటీ అని బాలీవుడ్ సినిమా స‌ర్కిల్స్ న‌మ్మ‌కం పెట్టుకున్నాయి. హిందీ మార్కెట్ లో ఎక్కువ మొత్తాన్ని క‌లెక్ట్ చేసిన సినిమాగా దంగ‌ల్ కున్న రికార్డును కేజీఎఫ్ తుడిచిపెట్టేసింది. ఇప్పుడు మ‌ళ్లీ ఈ రికార్డును తిరిగి సాధించే బాధ్య‌త అమీర్ ఖాన్ కు అప్ప‌గించింది బాలీవుడ్.

అందుకే ఈ భారీ బడ్జెట్ చిత్రం LalSinghChaddha సౌత్ చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్‌లకు బ‌దులిస్తుందా అన్న ప్ర‌శ్న‌పై చర్చ జరుగుతోంది. కొన్నేళ్లుగా బాలీవుడ్ సినిమాకు సౌత్ సినిమాల నుంచి గ‌ట్టిపోటీ వ‌స్తోంది. RRR, KGF 2, మేజ‌ర్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద‌ర‌గొడితే, షంషేరా, గంగూబాయి కతియావాడి, ఇలా బాలీవుడ్ సినిమాలు కొన్ని బాక్సాఫీస్ ( BO) వ‌ద్ద కల‌క్ష‌న్స్ కోసం కిందామీద పడ్డాయి. ఇక‌ సామ్రాట్ పృథ్వీరాజ్, షంషేరాలు బాలీవుడ్ ప‌రువుతీసేశాయి. ఇప్పుడు బాలీవుడ్ ఆశాకిర‌ణం లాల్ సింగ్ చద్దానే. కానీ, బాలీవుడ్ చిత్రాల క‌ష్టాల‌కు అమీర్ ఖాన్ కారణమని చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ఆరోపించారు. ఇదేం ఆరోప‌ణ‌?

కాఫీ విత్ కరణ్ 7 షో(koffee with karan season 7)లో కరణ్ జోహార్ ఒక ఆస‌క్తిక‌ర విష‌యాన్ని జ‌నం ముందుంచాడు. బాలీవుడ్ సినిమాల్లో మార్పు తెచ్చింది అమీర్ ఖాన్. లగాన్(Lagaan), దిల్ చాహ్తా హై(Dil Chahta Hai), తారే జమీన్ పర్(Taare Zameen Par) సినిమాల‌ గొప్ప‌ద‌నం గురించి మాట్లాడారు. ఇవ‌న్నీ క్లాసిక్స్. మాస్ సినిమాలు కాదు. ఆ త‌ర్వాత వ‌చ్చిన‌ బాలీవుడ్ డైరెక్ట‌ర్లు ఆ రూట్ లో వెళ్తున్నారుత‌ప్ప‌, క‌మ‌ర్షియ‌న్ సినిమాల జోలికి వెళ్లలేదు. కరణ్ అందుకే అమీర్‌ను అడిగాడు, “ఇటీవల కెజిఎఫ్‌లో ఉన్న టోనాలిటీ ఒక‌ప్పుడు మన సినిమాల్లో ఉండేది. వాస్త‌వానికి దాన్ని మ‌నం వ‌దిలేశాం. దానికి కార‌ణం మీరే అని ఆరోపించాడు.
What is Karan Johar in Koffee With Karan 7
క‌ర‌ణ్ కామెంట్ కి అమీర్ ఖాన్ ఇచ్చిన రెస్పాన్స్, నిజంగా కొత్త సినిమా ద‌ర్శ‌కులు వినాలి. సినిమాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉండాలని అన్నారు. “కాదు తప్పు చేసింది మీరు. అవన్నీ హార్ట్‌ల్యాండ్ సినిమాలు. ఆ సినిమాల్లో భావోద్వేగాలు ఎక్కువ‌. అవి సామాన్యులకు చేరువయ్యాయి. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే విషయమే అది. రంగ్ దే బసంతి చాలా ఎమోషనల్ ఫిల్మ్. ఇది కింది స్థాయి ప్రజలను హత్తుకుంటుందని అమీర్ ఖాన్ చెప్పారు.

ఇదే కాఫీ విత్ కరణ్ 7లో, ఇంత‌కుముందు బాలీవుడ్ చిత్రాల కంటే సౌత్ ఇండియన్ సినిమాలు మెరుగ్గా ఆడుతున్నాయ‌ని అక్షయ్ కుమార్ చెప్పారు. బాలీవుడ్‌లోని తారలు మల్టీస్టారర్ సినిమా చేయడానికి ఇష్టపడరని, అది మారాలని, అప్పుడు బాలీవుడ్ భాగ్య‌రేఖ కూడా మారుతుంద‌న్న‌ది అక్ష‌య్ కుమార్ మాట‌.