Idream media
Idream media
జగతి పబ్లికేషన్స్ వ్యవహారంపై నిక్కచ్చిగా ఆడిట్ చేసినందుకే ఐఆర్‌ఎస్ అధికారి కృష్ణకిషోర్‌పై కక్ష గట్టి పద్ధతి లేకుండా ఆయన్ను సస్పెండ్ చేశారని ప్రతిపక్ష నేత ఎన్.చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇది ఉన్మాది చర్య కాకుంటే మరేంటన్నారు. దీనిపై సభలో చర్చ జరగకుండా చేయాలనే తనను అడ్డుకున్నారని విమర్శించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే సభను పక్కదోవ పట్టించారని మండిపడ్డారు.
నిన్న శుక్రవారం సభ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూకుమ్మడిగా తనపై దాడి చేయాలనుకుంటున్నారని, మీరింతలా కక్ష సాధిస్తారని తెలిస్తే ప్రజలు వైఎస్సార్‌సీపీకి అధికారం ఇచ్చేవారు కాదన్నారు. సభలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు స్పీకర్ ఎప్పుడంటే అప్పుడు మైక్ ఇస్తున్నారని పేర్కొన్నారు.
14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని అడ్డుకునే అధికారం చీఫ్ మార్షల్‌కు ఉంటుందా? అని చంద్రబాబు మండిపడ్డారు. చీఫ్ మార్షల్‌ను బాస్టర్డ్ అన్నానని వక్రీకరించారని, సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి అనని మాటలు అన్నట్లు చెబుతున్నారని అన్నారు. సీఎం విలువలు, విశ్వసనీయత లేకుండా మాట్లాడుతున్నారన్నారు. సీఎంపై సభాహక్కుల నోటీసిచ్చామని చెప్పారు.