iDreamPost
android-app
ios-app

రూటు మార్చిన శర్వానంద్

  • Published Feb 01, 2023 | 3:36 PM Updated Updated Feb 01, 2023 | 3:36 PM
  • Published Feb 01, 2023 | 3:36 PMUpdated Feb 01, 2023 | 3:36 PM
రూటు మార్చిన శర్వానంద్

వరస డిజాస్టర్ల తర్వాత 2022లో ఒకే ఒక జీవితంతో డీసెంట్ హిట్ ఖాతాలో వేసుకున్న శర్వానంద్ ఇటీవలే పెళ్లి కొడుకైన సంగతి తెలిసిందే. బ్యాచిలర్ గా ఇప్పటిదాకా గడిపిన సోలో లైఫ్ కి గుడ్ బై చెప్పేశాడు. చాలా కాలం తర్వాత సక్సెస్ వచ్చింది కాబట్టి దాన్ని నిలబెట్టుకునే క్రమంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. గతంలో రౌడీ ఫెలో, చల్ మోహనరంగా ఫేమ్ కృష్ణ చైతన్యకు ఓకే చెప్పాడు కానీ ఏవో కారణాల వల్ల ఇప్పుడీ కాంబో సాధ్యపడటం లేదు. ఇదే దర్శకుడు నితిన్ తో పవర్ పేట తీయాలని ప్రయత్నించి విఫలమయ్యాడు.

శర్వానంద్ తాజాగా ఇద్దరు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అప్డేట్. అందులో మొదటి వ్యక్తి శ్రీరామ్ ఆదిత్య. శమంతకమణి. దేవదాస్ లాంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న ఇతను గత సంక్రాంతికి అశోక్ గల్లాని పరిచయం చేస్తూ తీసిన హీరో ఆశించిన విజయం సాధించలేదు. లాంచ్ కోసం కమర్షియల్ సబ్జెక్టుని ఎంచుకోవడం ఫ్లాప్ ఇచ్చింది. అయితే ఈసారి పూర్తిగా డిఫరెంట్ జానర్ ని ఎంచుకుని శర్వాకో కథ చెప్పడం అది వెంటనే నచ్చడం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లొచ్చని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది

రెండో వ్యక్తి కెవి గుహన్. కళ్యాణ్ రామ్ 118తో దర్శకుడిగా మారిన ఈ సినిమాటోగ్రాఫర్ డెబ్యూతోనే మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత ఓటిటి కోసం చేసిన డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యూ పెద్దగా రెస్పాన్స్ తెచ్చుకోలేదు. ఆనంద్ దేవరకొండతో చేసిన హైవే సైతం నేరుగా డిజిటల్ బాటే పట్టింది. పర్వాలేదనిపించుకుంది కానీ గొప్పగా వెళ్ళలేదు. ఈయన చెప్పిన లైన్ ఒకటి శర్వానంద్ కి నచ్చడంతో ఇదీ పట్టాలు ఎక్కడం దాదాపు ఖాయమే. పెళ్లయ్యింది కాబట్టి కొంత గ్యాప్ తీసుకుని త్వరలోనే వీటిలో ఒకటి మొదలుపెట్టొచ్చని టాక్

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş