iDreamPost
android-app
ios-app

రిలయన్స్ రిటైల్ స్టోర్స్‌లో తనిఖీలు.. శాంపిల్స్ తీసుకెళ్లిన అధికారులు

రిలయన్స్ రిటైల్  స్టోర్స్‌లో  తనిఖీలు.. శాంపిల్స్ తీసుకెళ్లిన అధికారులు

ఇటీవల కాలంలో ఏ వస్తువు కొనాలన్నా, తినాలన్నా ఏదీ నకిలీయో, ఏదీ అసలైనదో తెలియక సతమతమౌతున్నారు హైదరబాద్ నగర వాసులు. పాల దగ్గర నుండి ప్రతి వస్తువు కల్తీ రూపంలో విచ్చల విడిగా మార్కెట్‌లోకి వచ్చేస్తోంది. వెల్లువెత్తిన ఫిర్యాదులతో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపడుతుండటంతో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్న సంగతి విదితమే. ఇటీవల హైదరాబాద్‌లో పేరు గాంచిన ఆల్ఫా హోటల్‌ను సీజ్ చేశారు అధికారులు. ఓ కస్టమర్ చేసిన ఫిర్యాదు మేరకు ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయగా.. నాణ్యత, శుభ్రత లేదని గుర్తించి తాళాలు వేశారు. ఇప్పుడు దీని ఎఫెక్ట్ కొన్ని రిటైల్, ఫుడ్ సంస్థలపై కూడా పడినట్లు కనిపిస్తుంది.

హైదరాబాద్‌లోని ప్రముఖ సంస్థ రిలయన్స్ రిటైల్ స్టోర్స్‌లో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. స్టోర్స్‌లోని కొన్ని ఆహార పదార్ధాలను పరిశీలించారు. సీల్డ్ ప్యాకేజీల ఎక్స్ పెయిరీ డేట్స్ వంటివి పరిశీలించింది జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ భాను తేజ గౌడ్ నేతృత్వంలోని బృందం. అలాగే కరాచీ బేకరీతో పాటు విజయ మిల్క్ పార్లర్‌లోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ -1లో ఉన్న కరాచీ బేకరీపై ఓ కస్టమర్ క్లంప్లైంట్ చేయగా.. ఈ తనిఖీలు జరిగాయి. పలు నమూనాలను సేకరించి.. వాటిని పరిశీలనకు పంపించారు. పలు ఫుడ్ స్టోర్లపై తనిఖీలు చేయడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు.