ఇటీవల కాలంలో ఉత్తరాంధ్ర లో గజపతులకు సంభందించిన చారిత్రక మన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా మాజీ కెంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు స్థానంలో అయన అన్న దివంగత ఆనంద గజపతి రాజు కుమార్తె సంచయిత గజపతి రాజుని నీయమించడం తో పాటు గజపతుల కుటుంబ సభ్యులను ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులుగా నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్నయాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్ల పై తదుపరి విచారణ ను హైకోర్ట్ ఎప్రిల్ 9 కి వాయిదా వేసింది.
ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం తో పాటు ఇతర ప్రతి వాదులకు హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గా ప్రసాద రావు మంగళ వారం ఉత్తర్వులు జారీ చేశారు. మన్సాస్ చైర్మన్ గా సంచయిత తో పాటు ట్రస్టు వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా సంచయిత ఆమె చెల్లెలు ఊర్మిళ, ఆర్వీ సునీతా ప్రసాద్ లను నియమిస్తు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 3 న జీవో నంబర్ 74, 75 లను జారీ చేసిన విషయం తెలిసిందే.
కాగా, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోలను సస్పెండ్ చెయ్యాలని కోరుతూ ట్రస్ట్ మాజీ చైర్మన్ అశోక్ గజపతి రాజు హైకోర్ట్ ని ఆశ్రయించారు. దీనితో పాటు సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా సంచయిత ని నియమిస్తునట్టు రాష్ట్రా ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 72 ను సవాలు చేస్తూ మన్సాస్ ట్రస్ట్ వ్యవస్థాపకుడైన పివీజీ రాజు కుమార్తె ఆర్వీ సునీతా ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్ పైన కూడా కౌంటర్ దాఖలు చెయ్యాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.