iDreamPost
android-app
ios-app

నా రక్తపు ప్రతి చుక్క భారతదేశాన్ని బలోపేతం చేస్తుంది.

  • Published Oct 31, 2019 | 9:23 AM Updated Updated Oct 31, 2019 | 9:23 AM
నా రక్తపు ప్రతి చుక్క భారతదేశాన్ని బలోపేతం చేస్తుంది.

అంతకు ముందు రోజు  భువనేశ్వర్ ర్యాలీలో ” ఈ రోజు ఇక్కడ ఉన్నా రేపు ఉండకపోవచ్చు … నేను చనిపోయినప్పుడు నా రక్తపు ప్రతి చుక్క భారతదేశాన్ని ఉత్తేజపరుస్తుంది … బలోపేతం చేస్తుంది..” అన్నారు.

వజాహత్ హబీబుల్లా ఇందిర సెక్రటేరియట్ లో డైరెక్టర్ గా ఉండేవారు ఆ రోజు భువనేశ్వర్ లో ఇందిర గాంధీతో పాటు ఉన్నారు … “ఆ ప్రసంగం ఆమె భారతదేశాన్ని ప్రజలకు ఇస్తున్నట్లుగా అనిపించింది. నేను చేయగలిగినది అంతా నేను చేసాను, ఇప్పుడు మీ ఇష్టం..” అని ఆమె చెప్పినట్లుగా అనిపించింది అన్నారు.

స్వామి లక్ష్మణ్ జు అంతక ముందు శ్రీనగర్ విజిట్ లో కలసినప్పుడు ఒక బిల్డింగ్ ప్రారంభోత్సవానికి మీరు రావాలి అని అడిగారు ..” . బ్రతికి ఉంటే కచ్చితంగా వస్తాను అని నవ్వుతూ ఇందిర సమాధానం ఇచ్చారు.
బేలూర్ లో రామకృష్ణ మిషన్ వారి మఠంలో ఒక సన్యాసికి కూడా  జులై నెలలో ఇలానే ఇందిర ఉత్తరం రాశారు.

శరీరం శక్తివంతంగా ఉన్నప్పటికీ, మరణం పట్టుకున్న చేతులకి అన్ని మూసుకుపోతున్నట్లు అనిపిస్తుంది …. సంకల్పం ముగుస్తున్నట్టు,  ఒక తెలియని వైపు వెతుకుతుంది.


లైఫ్ థ్రెట్ ఉంది అని ఇండియన్ ఇంటలిజెన్స్ లో పితామహుడు Ramji Nath Kao ఇందిరాతో చేప్పేరు … ఆయన రిటైర్ అయ్యాక ఇందిర ఆయన్ని సెక్యూరిటీ అడ్వైజర్ గా నియమించారు ..సరిహద్దు గోడ మరియు నివాస గృహాల మధ్య చాలా తక్కువ దూరం ఉంది ఇది నాకు ఇష్టంలేదు అని చెప్పేవారు .. .”నన్ను చంపడానికి వచ్చినప్పుడు, నన్ను రక్షించాల్సిన వారు మొదట పారిపోతారు” అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు . 

ఆ రోజు ఉదయం Peter Ustinovతో మీటింగ్ అయ్యాక ..ప్రతీ రోజు ఆరోగ్యం చెక్ చేసే Dr. KP మాథుర్ గారు వచ్చి చూసి వెళ్లారు. ఇంటి నుండి PMO కి వెళ్తున్నారు.పక్కన కానిస్టేబుల్ నారాయణ్ సింగ్, వ్యక్తిగత భద్రతా అధికారి రామేశ్వర్ దయాల్, వ్యక్తిగత కార్యదర్శి ఆర్.కె. ధావన్. 

గేట్ దగ్గర అత్యంత విశ్వసనీయ బాడీ గార్డ్స్ బియాంత్ సింగ్ … ఇందిరతో 9 ఏళ్ళు ఉన్నారు,ప్రతీ ఫారిన్ ట్రిప్ కి తోడు ఉన్నాడు . ఆపరేషన్ బ్లూ స్టార్ తరువాత బియాంత్ సింగ్ ను  తొలగిస్తే,లేదు ఇతను ఉండాల్సిందే అని తిరిగి తన బాడీ గార్డ్ గా ఇందిరా పెట్టుకున్నారు .

రోజు లాగానే నమస్తే అని చెప్పారు ఇందిర బియాంత్ సింగ్ కి … .ప్రతిగా బియాంత్ సింగ్ 38 రివాల్వర్  గురి పెట్టాడు . “ఏమి చేస్తున్నావు..” అని ఇందిరా అడిగారు.  3 బుల్లెట్లుపాయింట్ బ్లాంక్ రేంజ్ లో దూసుకెళ్లాయి.22 ఏళ్ళ సత్వంత్ సింగ్ కొన్ని రోజుల ముందే లాంగ్ లీవ్ తరువాత డ్యూటీ లో జాయిన్ అయ్యాడు .అతను భయంతో సంశయించాడు కాల్చడానికి …బియాంత్ సింగ్ “కాల్చు..” అన్ని గట్టిగా అరవడంతో తన ఆటోమేటిక్ స్టెన్ గన్ నుండి ఇరవై ఐదు బుల్లెట్లను కాల్చాడు.

ఇంచుమించు అన్ని బుల్లెట్లు ఛాతిలోకి కడుపులోకి చీల్చుకుని వెళ్లిపోయాయి …


అంబులెన్సు డ్రైవర్ టీ తాగడానికి వెళ్లడంతో RK ధావన్ , పోలీస్ ఆఫీసర్ , దినేష్ భట్ ఇందిరను మోసుకెళ్లి ఆవిడ కార్ లో AIIMS తీసుకెళ్లారు…ముందుగా చెప్పకపోవడంతో డాక్టర్లు ఎమర్జెన్సీ కి రెడీ కాలేకపోయారు.

28 బులెట్లు ఇందిర శరీరాన్ని చీల్చుకుని వెళ్లినా ఆవిడ గుండె చెక్కుచెదరకుండా ఉంది.

Generations to come will scarce believe that such a one as this ever in flesh and blood walked upon this earth